ఐపీఎల్ ఆటగాడు ఆసీస్ హార్డ్ హిట్టర్ డేవిడ్ వార్నర్ కి ఇష్టమైన నగరం ఏది? అంటే.. కచ్ఛితంగా అతడు హైదరాబాద్ కే ఓటేస్తాడు. ఐపీఎల్ సీజన్ కోసం అతడు ఇక్కడ అడుగుపెట్టడమే గాక నగరంలో షికార్లు చేశాడు. ఇండియా అంటే అతడికి ఇష్టం. అందునా హైదరాబాద్ అయితే మరింత ఇష్టం. అతడికి ఇక్కడ భారీ ఫాలోయింగ్ ఉంది. అందుకే తన అభిమానుల కోసం ఇన స్టాలో తెలుగు పదాలతో ఒక సందేశం రాసాడు. నా రెండో ఇల్లు ఇండియా నచ్చే నగరం హైదరాబాద్ అంటూ అభిమానం ప్రదర్శించాడు.
వార్నర్ తన కుమార్తెతో హైదరాబాద్ లో కొంత సమయం గడిపిన ఫోటోలు.. తన కుమార్తెతో ఆటో రిక్షాలో ప్రయాణం. సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానుల స్నాప్.. సెంచరీ ఆనందం.. ఇవన్నీ తీపి జ్ఞాపకాలు అతడికి. వీటన్నిటినీ మించి అతడు కొంతకాలంగా తెలుగు సినిమా పాటలకు నర్తిస్తున్న డూప్ వీడియోల్ని ప్రదర్శిస్తూ బోలెడంత ఫాలోయింగ్ సంపాదించాడు.
మెర్సెర్ క్వాలిటీ ఆఫ్ లివింగ్ ర్యాంకింగ్స్ 2018 ప్రకారం హైదరాబాద్ వరుసగా నాలుగవసారి భారతదేశంలో ఉత్తమ నగరంగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా సిటీ ర్యాంకింగ్స్ లో హైదరాబాద్ 142 వ స్థానంలో ఉంది. అందుకే ఈ నగరం అంటే వార్నర్ లాంటి ఎందరికో ఇష్టం. ఆట సంగతికొస్తే... తదుపరి వెస్టిండీస్.. బంగ్లాదేశ్ పరిమిత-ఓవర్ల మ్యాచ్ ల కోసం అతడు సన్నద్ధమవుతాడు. ప్రపంచదేశాల్ని ఒణికిస్తున్న కోవిడ్ క్రికెట్ కి పెద్ద అడ్డంకిగా మారింది. తదుపరి టూర్ల విషయంలో ఏం జరగనుందో ఏదీ చెప్పలేని సన్నివేశం ఉంది.