క్రికెట్ లో స్లెడ్జింగ్ అనేది సర్వసాధారణమైన విషయం. అందులోనూ ఆసీస్ క్రికెటర్లకు స్లెడ్జింగ్ అనేది వెన్నతోపెట్టిన విద్య. ప్రత్యర్థి జట్లపై మాటల దాడితోనే సగం విజయం సాధిస్తుంటారు. అటువంటిది తాజాగా ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ కు దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ క్వింటన్ డీకాక్ నుంచి దూషణలు ఎదురయ్యాయి. డర్బన్ లో దక్షిణాఫ్రికా-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన తొలి టెస్టులో వార్నర్ - డీకాక్ లు ఒకరినొకరు తీవ్రస్థాయిలో దూషించుకోవడం కలకలం రేపింది. టీ విరామ సమయంలో డ్రెస్పింగ్ రూమ్ కు వెళ్లే సందర్భంలో వారు తీవ్ర వాగ్వాదానికి దిగారు. సహచర ఆటగాళ్లు వారిస్తున్నా వినకుండా వార్నర్ ....డీకాక్ ను కొట్టేందుకు దూసుకెళ్లాడు. వార్నర్ కు డికాక్ కూడా గట్టిగానే జవాబిచ్చాడు. వివాదం చినికి చినికి గాలివానగా మారనుండడంతో ఇరు జట్ల కెప్టెన్ లు వారిద్దరినీ డ్రెస్సింగ్ రూంలోకి తీసుకెళ్లారు. వారిద్దరి ఘర్షణ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో, ఆ ఘటనపై క్రికెట్ ఆస్ట్రేలియా విచారణకు ఆదేశిచింది.
అయితే, డేవిడ్ వార్నర్ తో పెళ్లికి ముందు వార్నర్ భార్య కాండిస్ పలువురు స్టార్ ప్లేయర్లతో డేటింగ్ చేసింది. ఆ వ్యవహారంపై డికాక్ కామెంట్ చేయడంతోనే వార్నర్ అతడిని దూషించాడని ఆసీస్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. మైదానంలో ఆటగాళ్ల ప్రవర్తనను అంపైర్లు నియంత్రించాలని డుప్లెసిస్ అభిప్రాయపడ్డాడు. ఈ ఘటనలో ఇద్దరూ ఒకరినొకరు దూషించుకున్నారని, ఒకవేళ ఈ గొడవ మైదానంలోనే ప్రారంభమై ఉంటే దానిని మొగ్గదశలోనే తుంచి ఉండాల్సిందన్నాడు. వార్నర్ , అతడి భార్య ని వ్యక్తిగతంగా దూషించడం వల్లే ఈ గొడవ మొదలైందని ఆసీస్ సారథి స్మిత్ అన్నాడు. అయితే, వార్నర్ భార్య కాండిస్ గురించి డీకాక్ ఏం కామెంట్ చేశాడనే దానిపై అధికారికంగా ఎటువంటి ప్రకటనను సీఎ విడుదల చేయలేదు.