దావూద్ కు కోపం తెప్పించిన ఆ సెల‌బ్రిటీ ఎవ‌రు?

Update: 2018-02-21 06:34 GMT
త‌న కనుసైగ‌తో ప్ర‌పంచాన్ని శాసిస్తున్న భార‌త్ మోస్ట్ వాంటెడ్ క్రిమిన‌ల్ దావూద్ ఇబ్రహీం కు కోపం వ‌చ్చింది. అందుకే హైద‌రాబాద్ కు చెందిన ఓ సెల‌బ్రిటీని హ‌త్య‌చేసేందుకు త‌న చిర‌కాల స‌న్నిహితుడు చోటా షకిల్ తో ఒప్పందాన్ని కుద‌ర్చుకున్నాడు. 257 మందిని బలిగొన్న 1993 నాటి ముంబై బాంబు పేలుళ్ల కేసులో దావూద్‌ ను పట్టుకోవడానికి భారత్‌ యత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో దావూద్ చేస్తున్న కుట్ర‌ను ఢిల్లీ పోలీసులు భ‌గ్నం చేశారు.

 కొద్ది కాలం క్రితం దావూద్ భాయ్ మృతి చెందాడ‌నే వార్త‌లు వ‌చ్చాయి. అయితే వార్త‌ల్ని కొట్టిపారేసిన చోటాషకిల్ ..త‌న బాస్ దావూద్ బ్ర‌తికే ఉన్నాడ‌ని ప్ర‌క‌టించాడు. ఆ ప్ర‌క‌ట‌న‌తో అల‌ర్ట్ అయిన భార‌త్ దావూద్ అనుచ‌రుల్నిమ‌ట్టుబెట్టేందుకు ప్ర‌య‌త్నాలు కొన‌సాగిస్తుంది.  దావూద్ కోసం డేగ‌క‌ళ్ల‌తో ప‌హారా కాస్తున్న పోలీసులు దావూద్ అనుచ‌రుల్ని ఏరిపారేసేందుకు  వ్యూహాలు ర‌చ‌యిస్తున్నారు.  ఈ వ్యూహంలో భాగంగా కుట్ర వెలుగులోకి వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది.

 అన‌ధికారికంగా పాక్ లో ఉన్న దావూద్ ఇబ్ర‌హిం హైదాబాద్ కు చెందిన ప‌లువురు సెల‌బ్రిటీల్ని హ‌త్య చేసేందుకు కుట్ర‌ప‌న్నాడు. ఈ కుట్ర‌లో భాగంగా దావూద్ కు న‌మ్మిన బంటు చోటా షకిల్ తో రూ.45ల‌క్ష‌ల ఒప్పందం కుదుర్చుకొని వారిని హ‌త‌మార్చాల‌ని ఆదేశాలు జారీ చేశాడు. గురువు ఆజ్ఞ‌తో సిద్ధ‌మైన‌ చోటా షకిల్ - షార్ప్ షూట‌ర్ న‌సీం అలియాస్ రిజ్వాన్ కు ఆ ప‌నిని అప్ప‌గించాడు. అయితే హ‌త్య ఒంటిరిగా చేయోద్ద‌ని ఉత్త‌ర ప్ర‌దేశ్ గ్యాంగ్ స్ట‌ర్ మున్నాసింగ్ తో క‌లిసి చేయాల‌ని షకిల్ చెప్పాడు.

ష‌కిల్ తో  కుదుర్చుకున్న ఒప్పందం ప్ర‌కారం హైద‌రాబాద్ లో ఉన్న సెల‌బ్రిటీల్ని హ‌తమార్చేందుకు న‌సీం - మున్నా సింగ్ ను క‌లిసేందుకు సిద్ధ‌మ‌య్యాడు. అయితే  న‌సీం ప్ర‌ధాన అనుచ‌రుడిగా ఉన్న జునైద్ చౌద‌రి ఈ విష‌యాన్ని ఢిల్లీ పోలీసుల‌కు స‌మాచారం అందించాడు. అప్ప‌టికే డీ- గ్యాంగ్ కోసం ప‌హారా కాస్తున్న ఢిల్లీ నార్త్ ఈస్ట్ పోలీసులు గుర్గావ్ లో షూట‌ర్ న‌సీంను అదుపులోకి తీసుకొని విచారించారు. ఈ విచార‌ణలో అనేక సంచ‌ల‌న విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి. దావుద్ ఇబ్ర‌హిం  హైదరాబాద్‌ కు చెందిన సెలబ్రిటీతో పాటు ‘కాఫీ విత్‌ డీ' సినిమా నిర్మాత తీహార్ జైల్లో ఉన్న చోటా రాజన్ తదితరులను చంపేందుకు 1.5 కోట్ల డీల్ కుదుర్చుకున్నట్టు తేలింది. ఇంత‌కీ ఆ సెల‌బ్రిటీ ఎవ‌రు..? హైదరాబాద్ లో ఉన్న ఆ సెల‌బ్రిటీని పాక్ లో ఉన్న దావూద్ ఎందుకు చంపాల్సి వ‌చ్చింది అనే విష‌యాల‌పై ఆరాతీస్తున్నారు.
Tags:    

Similar News