పెను ప్రమాదం తృటిలో తప్పిందా? అంటే అవుననే మాట వినిపిస్తోంది. ఓపక్క ప్రకృతి వైపరీత్యాలు.. మరోపక్క మానవ తప్పిదాలతో ఒకటి తర్వాత ఒకటిగా దేశ ఆర్థిక రాజధాని ప్రజలకు ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఇవి సరిపోనట్లు తాజాగా అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ముంబయిలో మరో మారణహోమానికి కుట్ర పన్నాడా? అంటే అవుననే మాట ఇప్పుడు షాకింగ్ గా మారింది.
ముంబయిలో అల్లకల్లోలం సృష్టించే పనిలో భాగంగా దావూద్ గ్యాంగ్ స్కెచ్ గీసిందని.. దాన్ని పోలీసులు గుర్తించటంతో వారి ప్లాన్ కొంత భాగం బయట పడిందని చెబుతున్నారు. అతని అనుచరుడు అనీస్ ఇబ్రహీం ద్వారా తాజాగా దాడులు చేయాలని దావూద్ ఇబ్రహీం ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. దావూద్.. అనీస్ ల మధ్య ఫోన్ కాల్స్ ను ట్యాప్ చేయటం ద్వారా కుట్ర కోణం బయటకు వచ్చిందంటున్నారు.
దావూద్ కుట్రతో అలెర్ట్ అయిన ముంబయి పోలీసులు తాజాగా ఎనిమిది మంది అనుమానితుల్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. దీంతో.. ముంబయి మారణహోమానికి సంబంధించిన సమాచారం కాస్త బయటకు వచ్చింది. దాయాది పాక్ లో ఉంటున్న నరరూప రాక్షసుడు దావూద్.. ముంబయిని గతంలోనూ బాంబులతో దద్దరిల్లిపోయేలా చేశారు. వందలాది మంది ప్రాణాల్ని తీశాడు. తాజాగా మరోసారి మారణహోమానికి ప్లాన్ చేశారన్న మాట ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది.