ముంబైలో 1993లో వరుస బాంబు పేళుళ్ల కేసులో భారత్ కు మోస్ట్ వాంటెడ్ అయిన మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం పాకిస్థాన్ లోనే ఉన్నాడని భారత్ చేస్తోన్న ఆరోపణలు నిజమయ్యాయి. కరాచీ లో తలదాచుకుంటున్న ఆయన ఇంటి ఫోన్ నెంబర్ ను భారత నిఘావర్గాలు కనిపెట్టాయి. ఆ నెంబర్ ద్వారా దావూద్ ఉంటున్న ఇంటి అడ్రస్ కూడా తెలిసింది.
ఈ ఫోన్ నెంబర్ ను ఓ జాతీయ ఛానెల్ సేకరించి దావూద్ తో మాట్లాడేందుకు ప్రయత్నించింది. ఆ జాతీయ ఛానెల్ ప్రతినిధి ఆ నెంబర్ కు కాల్ చేయగా ఆయన భార్య మొహజబీన్ ఆ..ఫోన్ ను లిఫ్ట్ చేసింది. ఆయన నిద్రపోతున్నారని సమాధానమిచ్చింది. మీరు కరాచీలోనే ఉంటున్నారు కదా! అని రిపోర్టర్ ప్రశ్నించగా ఔనని సమాధాన మిచ్చింది. దావూద్ వివరాలేవీ చెప్పకుండా కేవలం అతడు నిద్రపోతున్నాడని మాత్రమే చెప్పి, ఫోన్ కట్ చేసింది.
సో.. దావూద్ పాకిస్తాన్ లో ఉన్నాడని డిసైడైంది. ఇప్పటికైనా పాక్ ఇండియాకు దావూద్ ను అప్పగిస్తుందా... లేక అతడు మా.. దగ్గర తలదాచుకున్నాడన్నది పచ్చి అబద్దం అని నిజాన్ని దాచేస్తుందా చూడాలి.