తాము మనుష్యులం కాదని, రాక్షస జాతిలో తమది ఒకటని నిరూపించే పని మరొకటి చేశారు ఉగ్రవాదులు. శుక్రవారం సాయంత్రం జమ్మూకశ్మీర్ కుప్వారా జిల్లాలోని మచిల్ సెక్టర్ లో ఉగ్రవాదులు చొరబాట్లకు ప్రయత్నించారు. ఒకవైపు పాక్ సైన్యం కాల్పులతో చెలరేగుతుండగా.. మరోవైపు ఇదే అదనుగా భావించి కశ్మీర్ లోకి చొరబడేందుకు ప్రయత్నించారు ఈ ఉగ్రవాదులు. వారిని భారత సైన్యం అడ్డుకోవడంతో ఎదురుకాల్పులు జరిగాయి. అయితే ఈ ఎదురుకాల్పుల్లో ఒక మిలిటెంట్ మృతిచెందగా... భారత సైనికుడు కూడా ఒకరు అమరుడయ్యరు. అనంతరం భారత సైన్యం కాల్పులతో తోకముడిచిన రాక్షస సంతానం... అమరుడైన సైనికుడిపై వారి పిరికి ప్రతాపాన్ని చూపించారు. సైనికుడి మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి, అనంతరం పాక్ ఆక్రమిక కశ్మీర్ లోకి పారిపోయారు.
ఈ దుర్మార్గ చర్యపై భారత సైన్యం తీవ్రంగా స్పందించింది. ఉగ్రవాదుల ఈ దుర్మార్గకాండపై తగినరీతిలో ప్రతీకారం తీర్చుకుంటామని స్పష్టం చేసింది. సరిహద్దులకు ఆవల ఉన్న అధికారిక - అనధికారిక పాక్ సైన్యం అనాగరిక చర్యకు ఇది ప్రత్యక్ష నిదర్శనమని, దీనికి తగిన రీతిలో భారత్ బదులిస్తుందని సైన్యం స్పష్టం చేసింది.
కాగా శనివారం ఉదయం కూడా సరిహద్దుల మీదుగా పాక్ సైన్యం యథేచ్ఛగా కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడుతోంది. ఈ క్రమంలో తాజాగా మచిల్ సెక్టార్ లో నితిన్ సుభాష్ అనే మరో బీఎస్ ఎఫ్ జవాను ప్రాణాలు విడిచారు. గత కొన్నిరోజులుగా పాక్ చేస్తోన్న కాల్పుల విరమణ ఉల్లంఘన కారణంగా పలువురు బీఎస్ ఎఫ్ జవాన్లు ప్రాణాలు విడిచిన సంగతి తెలిసిందే.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/