హ‌ల్దీరామ్స్ హోట‌ల్లో అంత దారుణ‌మ‌ట‌!

Update: 2019-05-17 06:39 GMT
కొన్ని బ్రాండ్ల‌కు ఉండే ఇమేజ్ అంతా ఇంతా కాదు. హైద‌రాబాద్ అన్నంత‌నే ప్యార‌డైజ్ బిర్యానీ గుర్తుకు రావ‌టం ఎంత స‌హ‌జ‌మో.. నాగ‌పూర్ పేరు ప్ర‌స్తావించిన వెంట‌నే హ‌ల్దీరామ్స్ ను గుర్తు చేసుకుంటారు. నాగ‌పూర్ వెళ్లిన చాలామంది త‌ప్ప‌నిస‌రిగా హ‌ల్దీరామ్స్ హెడ్ క్వార్ట‌ర్ తో పాటు.. వారి హోట‌ల్ కు వెళుతుంటారు. ఈ నేప‌థ్యంలో స‌ద‌రు యాజ‌మ‌న్యం జాగ్ర‌త్త‌గా ఉండాల్సిన అవ‌స‌రం ఉంది.  

అందుకు భిన్నంగా దొర్లే చిన్న చిన్న త‌ప్పుల‌కు సైతం భారీ మూల్యం చెల్లించాల్సి వ‌స్తుంది. అందుకే కేర్ ఫుల్ గా ఉండాలి. కానీ..తాజాగా ఒక ప్ర‌ముఖ తినుబండారాల వారి హోట‌ల్లో జ‌ర‌గ‌కూడ‌ద‌ని త‌ప్పు జ‌రిగిపోయింది. ప్ర‌ముఖ చిరుతిళ్ల త‌యారీ సంస్థ హ‌ల్దీరామ్స్ కు చెందిన హోట‌ల్ ఒక‌టి నాగ్ పూర్ లో ఉంది. ఈ హోట‌ల్లో టిఫెన్లు కూడా అమ్ముతుంటారు. ఇదిలా ఉండ‌గా తాజాగా ఒక వ్య‌క్తి  హోట‌ల్ కు వెళ్లి వ‌డ సాంబార్ ఆర్డ‌ర్ ఇచ్చారు. అయితే.. ఈ సాంబార్ లో బ‌ల్లి ప‌డ‌టం.. దాన్ని తిన్న వ్య‌క్తి ఆసుప‌త్రి పాల‌య్యారు.

దీంతో.. త‌న‌కు జ‌రిగిన అన్యాయం గురించి పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చారు బాధితుడు.. స‌ద‌రు హ‌ల్దీరామ్స్ మీద చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు. త‌న‌కు జ‌రిగిన అన్యాయాన్ని సోష‌ల్ మీడియాలో షేర్ చేశాడు బాధితుడు. ఇదిలా ఉంటే.. బ‌ల్లి ప‌డిన సాంబ‌ర్ తిన్న బాధితుడు ఆసుప‌త్రిలో జాయిన్ చేశారు. అత‌నికి వైద్యులు చికిత్స చేస్తున్నారు. 24 గంట‌ల పాటు వైద్యుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఉండాల‌ని వైద్యులు సూచించారు.

బాధితుడి ఫిర్యాదు మేర‌కు హ‌ల్దీరామ్స్ వంట‌గ‌దిని అధికారులు సంద‌ర్శించారు. ఇక్క‌డ పెద్ద ఎత్తున లోపాల్ని అధికారులు గుర్తించారు. ఆహార భ‌ద్ర‌త ప్ర‌మాణాల నిబంధ‌ల ప్ర‌కారం లేని నేప‌థ్యంలో ఈ హోట‌ల్ ను మూసివేస్తూ అధికారుల్ని నిర్ణ‌యించారు.


Tags:    

Similar News