కల్లోలం: 30 లక్షలు దాటిన మరణాలు

Update: 2021-04-18 05:48 GMT
దేశంలో కరోనా కల్లోలం చోటుచేసుకుంటోంది. ప్రపంచదేశాలతోపాటు భారత్ లోనూ దీని ప్రభావం అధికంగా ఉంది. ఇప్పటికే చాలా దేశాలు ఈ వైరస్ కారణంగా కుదేలయ్యాయి. అటు జనాలు, ఇటు సెకండ్ వేవ్ ధాటికి పిట్టల్లా రాలిపోతున్నారు.

బ్రెజిల్, ఫ్రాన్స్ లతోపాటుభారత్ లోనూ కరోనా పరిస్థితులు ప్రమాణకర స్థాయికి చేరుకున్నాయి. తాజాగా కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య దేశంలో 30 లక్షలు దాటేసింది.

వాస్తవ మరణాల సంఖ్య భారీగా ఉంటాయని అంచనా.. ప్రపంచవ్యాప్తంగా రోజుకు 7 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. 12 వేల మందికి పైగా మరణిస్తున్నారు. అమెరికాలోనే ఇప్పటివరకు 5.6 లక్షల మంది కరోనాతో మృతి చెందారు. ప్రపంచం మొత్తం మరణాల్లో ఆరింట ఒక వంతు అమెరికాలోనే నమోదవుతున్నాయి.అమెరికా తర్వాత బ్రెజిల్, మెక్సిన్, భారత్ , బ్రిటన్ ఉన్నాయి.

దేశంలో కరోనా పూర్తిగా తగ్గినట్టే తగ్గి మళ్లీ విజృంభిస్తోంది. ప్రపంచదేశాలన్నీ మరోసారి కఠిన ఆంక్షలు విధిస్తున్నాయి.వ్యాక్సినేషన్ ను వేగవంతం చేస్తున్నాయి. వ్యాక్సిన్ల కొరత పలు దేశాలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. టీకాల కోసం అన్ని దేశాల వారు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
Tags:    

Similar News