దేశంలో మరణాలు ఈ 10 రాష్ట్రాల్లోనే ఎక్కువ.. !

Update: 2021-05-10 11:30 GMT
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి సెకండ్ వేవ్ విజృంభన కొనసాగుతుంది. ఓ వైవు కరోనా మహమ్మారి భరతం పట్టే వాక్సినేషన్ అందుబాటులోకి వచ్చినప్పటికీ కరోనా పాజిటివ్ కేసులు మాత్రం లక్షల సంఖ్యలో వెలుగులోకి వస్తున్నాయి. అలాగే , ఎక్కువ శాతం కరోనా  మరణాలు కూడా సంభవిస్తున్నాయి. వారు , వీరు అన్న తేడా లేకుండా సామాన్యుల నుండి ప్రముఖుల వరకు ప్రతి ఒక్కరూ కూడా కరోనా భారిన పడుతున్నారు. గత పది రోజుల్లో నాలుగు సార్లు నాలుగు లక్షలకి పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇక ప్రతి రోజు కూడా మూడువేలకి పైగా కరోనా మరణాలు సంభవిస్తున్నాయి.

 ఇక ఇదిలా ఉంటె ఇండియా లో నమోదవుతున్న కరోనా మరణాల్లో 72.86% మరణాలు 10 రాష్ట్రాల్లోనే సంభవిస్తున్నాయి. మహారాష్ట్ర, కర్ణాటక, యూపీ, ఢిల్లీ, తమిళనాడు, పంజాబ్, ఛత్తీస్ గఢ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, హర్యానాల్లో కరోనా మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి. మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, యూపీ, రాజస్థాన్, తమిళనాడులో యాక్టివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. అటు దేశవ్యాప్తంగా తాజాగా గడిచిన 24 గంటల్లో 14,74,606 కరోనా టెస్టులు చేయగా 3,66,161 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. గడిచిన 24 గంటల్లో 3,754 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజా కేసులతో కలిపి దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 2,26,62,575కి చేరుకుంది. ఇక మరణాల సంఖ్య 2,46,116కి చేరుకుంది. అటు గడిచిన 24 గంటల్లో 3,53,818మంది డిశ్చార్జ్ అయ్యారు. 37,45,237యాక్టివ్ కేసులున్నాయి.  అలాగే ,దేశంలో ఇప్పటివరకు 17.01కోట్ల మంది వ్యాక్సిన్‌ వేయించుకున్నారు.
Tags:    

Similar News