తమిళుల్ని వణికిస్తోన్న డిసెంబరు!

Update: 2016-12-06 07:01 GMT
ఏడిదిలో చివరి నెల వస్తుందంటే చాలు చాలామంది హ్యాపీగా.. హ్యాపీగా ఉంటారు. వణికించే చలి.. సంవత్సరం చివర్లో వచ్చే క్రిస్మస్.. ఆ వెంటనే వచ్చే న్యూఇయర్ బాష్ ఉత్సాహానికి గురి చేస్తుంటుంది. అందుకే.. చాలామందికి డిసెంబరు వస్తుందంటే చాలు.. ఎక్సైట్ అయిపోతుంటారు. ఎంతో మందికి ఆనందాన్ని ఇచ్చే డిసెంబరు వస్తుందంటే చాలు.. తమిళులకు తీరని శోకాన్ని మిగులుస్తున్నాయి.

ఒక దాని తర్వాత ఒకటిగా చోటు చేసుకుంటున్న ఉదంతాలు.. ఏడాదికేడాదికి డిసెంబరు వస్తుందంటే చాలు.. తమిళులు కంగారు పడిపోయే పరిస్థితిని తీసుకొస్తున్నాయి. తమిళులకు తీవ్రమైన మనో వ్యధను మిగిల్చిన విషాదకర ఘటనలు డిసెంబరులోనే చోటు చేసుకోవటం గమనార్హం. ఒక విధంగా చెప్పాలంటే.. తమిళులపై డిసెంబరు పగ బట్టిందా? అన్న భావన కలగటం ఖాయం.

తమిళ ప్రజలు ఎంతగానో ప్రేమించి.. ఆరాధించే నేతలు ఎందరో డిసెంబరు నెలలోనే చనిపోవటం గమనార్హం. తాజాగా.. తమిళులకు అమ్మగా ఫీలయ్యే జయలలిత సైతం ఇదే నెలలో కనిపించని లోకాలకు వెళ్లిపోవటం.. అది కూడా డిసెంబరు నెలలోనే కావటంతో ఈ నెల తమ పాలిట దురదృష్టపు నెల అయ్యిందా? అన్న భావన కలిగేలా చేస్తుందన్న అభిప్రాయం వినిపిస్తోంది.

గత ఏడాది ఇదే నెలలో  చెన్నైను.. ఇతర జిల్లాల్ని వణికించిన వరదల్ని మర్చిపోక ముందే.. ఈ ఏడాది డిసెంబరులో అమ్మను కోల్పోయి మరింత విషాదంలోకి తమిళులు కూరుకుపోయారు. మరో చిత్రమైన విషయం ఏమిటంటే.. ఇదే నెలలోనే జయలలిత గురువుగా భావించే మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్ సైతం ఇదే నెలలో మరణించారు. ఈ ఘటనలే కాదు.. భారత చివరి గవర్నర్ జనరల్ సి. రాజగోపాలాచారి.. తమిళులు అమితంగా ఆరాధించే పెరియార్ ఈవీ రామస్వామి సైతం ఇదే నెలలో మరణించారు. ఇక.. 2004లో విరుచుకుపడిన సునామీ (డిసెంబరు 26)  సైతం డిసెంబరులోనే కావటం చూస్తే.. షాకింగ్ గా అనిపించక మానదు. తమిళులంటే డిసెంబరుకు ఎందుకంత కోపమో..?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News