ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో టీమిండియా ఓటమి పాత లెక్కల్ని చాలానే తేల్చేస్తోంది. మొన్నటి వరకూ నివురు కప్పిన నిప్పులా ఉన్న టీమిండియా కోచ్.. కెప్టెన్ల మధ్యనున్న రచ్చ పెద్దది కావటమే కాదు.. కుంబ్లే తన పదవికి రాజీనామా చేసేశారు. ఇది సరిపోదన్నట్లుగా ఇండియా ఏ.. అండర్ 19 జట్లకు కోచ్ గా వ్యవహరిస్తున్న రాహుల్ ద్రవిడ్ కొత్త గళం విప్పారు.
గత కొంతకాలంగా సరైన ప్రతిభను ప్రదర్శించని సీనియర్ల మీద నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందంటూ ఇద్దరు ముఖ్యులకు ఎర్త్ పెట్టేశారు. టీంలో ఉన్న సీనియర్లు ధోనీ.. యువరాజ్ లను ఇంటికి పంపాలన్న సమయం ఆసన్నమైందన్న ఆయన.. తన వాదనను వినిపించారు.
ధోని.. యువరాజ్ ఇద్దరూ 36 ఏళ్లకు చేరువ అవుతున్నారని.. మరో రెండేళ్లలో వరల్డ్ కప్ టైంకి వీరిద్దరికి 38 ఏళ్లకు చేరువ అవుతారన్నారు. ఇలాంటి వేళ.. వీరి భవిష్యత్తుపై నిర్ణయం తీసుకోవాలన్న సంచలన సూచనను చేశారు. ఇప్పుడున్న సమయమే సరైనదని.. వరల్డ్ కప్ కు ఇప్పటికైనా సన్నద్ధం కావాలన్నారు.
ఇద్దరి విషయంలో సెలెక్టర్లు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని.. రెండేళ్ల తర్వాత కూడా వీళ్ల పాత్రను ఎలా చూడబోతున్నామన్నది ముఖ్యమన్నారు. అప్పటికీ ఇద్దరికి జట్టులో చోటు ఉంటుందా? అని ప్రశ్నించిన ద్రవిడ్.. వారి సామర్థ్యాన్ని మరోసారి అంచనా వేయటానికి మరో సంవత్సరం పడుతుందా? ఆర్నెల్లు పడుతుందా? అంటూ ప్రశ్నల మీద ప్రశ్నల్ని సంధిస్తున్నారు.
ఛాంపియన్స్ ట్రోఫీలో నాలుగు.. ఐదు స్థానాల్లో ఆడిన ధోనీ.. యువరాజ్ లు సరిగా రాణించలేదన్నది తెలిసిందే. ఫైనల్లో ఓటమి నేపథ్యంలో వీరిద్దరి మీద వేటు వేయాలన్న ద్రవిడ్ మాటలు ఇప్పుడు సంచలనంగా మారాయి. మరి.. దీనిపై సెలెక్టర్లు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/