ఒక అడుగు ముందుకు.. రెండు అడుగులు వెనక్కి వేసినట్లుగా వ్యవహరిస్తున్న అమ్మ జయలలిత మేనకోడలు దీపలో మార్పు వచ్చేసింది. తాను కొంతకాలం వేచి చూద్దామన్న ఆలోచనలో ఉన్నప్పటికీ.. రోజు తన ఇంటికి పోటెత్తుతున్న అభిమానుల తాకిడి ఆమె ఆలోచనల్ని మారుస్తున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. చిన్నమ్మను అన్నాడీఎంకే చీఫ్ గా ఏకగ్రీవంగా ఎన్నుకున్న వేళ.. తాను కొంతకాలం వెయిట్ చేస్తానని.. సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటానని చెప్పిన దీప.. తన ఆలోచనల్ని మార్చేసుకున్నట్లుగా కనిపిస్తోంది.
పలువురు అన్నాడీఎంకేకు చెందిన ద్వితీయశ్రేణి నేతలు బాహాటంగానే దీప వద్దకు రావటం.. ఆమెతో భేటీ కావటం ఒక ఎత్తు అయితే.. అభిమానులు వేలాది మంది నిత్యం ఆమె ఇంటి వద్ద గుమిగూడటం.. ఆమె కోసంవెయిట్ చేస్తుండటం.. ఆమె బయటకు వచ్చినంతనే హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక.. కటౌట్లు.. బ్యానర్ల హడావుడి గురించి చెప్పాల్సినఅవసరం లేదు.
తనను చూసేందుకు వస్తున్న వారితో మాట్లాడే సందర్భంలో జయ నామస్మరణను చేస్తున్నారు దీప. అంతేకాదు.. తనను పలుకరించటానికి వస్తున్న వారికి అన్నాడీఎంకే గుర్తు అయిన రెండు ఆకుల ముద్రతో పలుకరించటం గమనార్హం. మరోవైపు.. సంక్రాంతి తర్వాత వచ్చే అన్నాడీఎంకే పార్టీ వ్యవస్థాపకుడు ఎంజీఆర్ శత జయంతి సందర్భంగా భారీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని దీప భావిస్తున్నారు. జనవరి 17న నిర్వహించే ఈ కార్యక్రమంలో ఆమె తన కొత్త పార్టీకి సంబంధించిన వివరాల్ని ప్రకటించే వీలుందని తెలుస్తోంది. తాము కొత్త ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నామని.. ఇందుకు సంబంధించిన ప్రకటనను త్వరలోనే విడుదల చేయనున్నట్లు ఆమె చెబుతున్నారు. మొత్తంగా ఈ నెల మూడోవారంలో తమిళనాడు రాజకీయంగా కొత్త మార్పులు చోటు చేసుకోవటం ఖాయమన్న మాట వినిపిస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/