తమిళనాడు రాజకీయాలు రోజుకో కొత్త మలుపు తీసుకుంటూ నాన్ స్టాప్ ఉత్కంఠకు తెర లేపేశాయి. తమిళ ప్రజలు అమ్మగా కొలిచే ఆ రాష్ట్ర దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణం తర్వాత రోజుల తరబడి కొనసాగిన ఉత్కంఠభరిత పరిణామాలు మొన్న చిన్నమ్మ శశికళ విధేయుడు ఎడప్పాడి పళనిస్వామి సీఎం పీఠమెక్కడంతో ఉత్కంఠకు తెరపడిందన్న భావన వ్యక్తమైంది. అయితే అనూహ్యంగా అమ్మ మేనల్లుడు దీపక్ శశికళ వర్గానికి నిరసన గళం వినిపించడంతో మరోమారు టెన్షన్ వాతావరణం నెలకొంది.
తాజాగా అమ్మ మేనకోడలు దీపా జయకుమార్ కాసేపటి క్రితం చెన్నైలో మీడియా ముందుకు వచ్చారు. పన్నీర్ సెల్వంకు మద్దతు పలికిన దీప కూడా తన సోదరుడు దీపక్ లాగే ప్లేట్ పిరాయించేశారు. తాను పన్నీర్ సెల్వం వర్గం కాదని, పన్నీర్‌కు మద్దతిచ్చే ప్రసక్తే లేదని తేల్చేశారు. జయలలిత జయంతిని పురస్కరించుకుని పలు కార్యక్రమాల్లో పాలుపంచుకున్న దీపా జయకుమార్... తాను పన్నీర్ సెల్వం క్యాంపులో చేరబోనని ఆమె స్పష్టం చేశారు. ప్రస్తుతమున్న అన్నాడీఎంకే నాయకత్వాన్ని ప్రజలు ఆదరించడం లేదని ఆమె అభిప్రాయపడ్డారు.
అమ్మ ఆశయాలను సాధించేందుకు ప్రజా క్షేత్రంలోకి దిగుతానని కూడా దీపా తెలిపారు. అమ్మను అసెంబ్లీకి పంపిన ఆర్కే నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని తెలిపారు. పన్నీర్‌తో కలిసేది లేదని చెప్పడమే కాకుండా అన్నాడీఎంకే నాయకత్వంపైనా అసంతృప్తి వ్యక్తం చేసిన దీపా కొత్త రాజకీయ పార్టీ పెట్టేందుకు మొగ్గుచూపుతున్నట్లుగా స్పష్టమైన సంకేతాలిచ్చేశారు. దీంతో తమిళనాట మరో రాజకీయ పార్టీ తెరంగేట్రం చేయనుందన్న మాట. దీపా పెట్టనున్న పార్టీ ఎంతకాలం మనగలుతుందో చెప్పలేం కానీ... మరిన్ని రోజుల పాటు తమిళ రాజకీయాలపై జాతీయ స్థాయిలో చర్చ అయితే పక్కా దీపా ప్రకటన చెప్పకనే చెబుతోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/