జోకొవిచ్‌ భార్యతో దీపిక కబుర్లే..కబుర్లు

Update: 2015-07-11 10:29 GMT
వేర్వేరు రంగాలకు చెందిన సెలబ్రిటీల మధ్య స్నేహం పెద్ద విషయం కాకపోవచ్చు. కానీ.. వేర్వేరు దేశాలకు చెందిన సెలబ్రిటీల మధ్య అనుబంధం కాస్తంత తక్కువగానే ఉంటుంది. కానీ.. అందుకు భిన్నంగా ఉంది బాలీవుడ్‌ అందాలభామ దీపికా పదుకునే.. టెన్నిస్‌ స్టార్‌ జోకోవిచ్‌ సతీమణి.. మోడల్‌ జెలేనా రిస్టిక్‌ స్నేహం.

తాజాగా జరుగుతున్న వింబుల్డన్‌ టోర్నీని వీక్షించటానికి వెళ్లిన దీపిక ఫ్యామిలీ (దీపిక తండ్రి ప్రకాశ్‌ పదుకున ప్రఖ్యాత బ్యాట్మెండన్‌ ఆటగాడు).. జోకొవిచ్‌ సతీమణితో కలిసి చాలాసేపు కబుర్లు చెప్పుకోవటం పలువుర్ని ఆకర్షించింది. ఈ సందర్భంగా జెలేనాతో కలిసి దీపికా కుటుంబ సభ్యులంతా కలిసి ఫోటోలు దిగినట్లుగా.. ఆమె ట్విట్టర్‌ ఖాతాను చూస్తే తెలుస్తోంది.

మరోవైపు వింబుల్డన్‌ టోర్నీలో భారత్‌కు చెందిన ప్రముఖలు పలువురు హాజరువుతున్నారు. మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌తో పాటు.. ఆయన సతీమణి అంజలి.. స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌కోహ్లీ.. ఆయన ప్రియురాలు అనుష్క శర్మ తదితరులు హాజరవుతూ సందడి చేస్తున్నారు.

Tags:    

Similar News