సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇమేజ్ బిల్డింగ్ కు ఎవరి సాయమో పొందాల్సిన అవసరం పూర్తిగా పోయింది. ఎవరికి వారే తమ సొంత ప్రయత్నాలతో తమకు అవసరమైనంత ఇమేజ్ ను బిల్డ్ చేసుకుంటున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. మరికొందరి విషయంలో మాత్రం ఎలాంటి ప్రయత్నం లేకుండానే ఫేమస్ అయిపోతున్నారు.
తాజా సోషల్ మీడియా సంచలనంగా నిర్మలా సీతారామన్ ను చెప్పాలి. రక్షణ మంత్రిగా ఆమె ప్రమోట్ అయిన తర్వాత ఆమెపై మీడియా ఫోకస్ బాగా పెరిగింది. దేశంలో పూర్తిస్థాయి రక్షణ మంత్రి బాధ్యత నిర్వహించిన తొలి మహిళగా నిర్మలా రికార్డు సృష్టించారు.
ఉక్కు మహిళగా పేరొందిన దివంగత ప్రధాని ఇందిరాగాంధీ తర్వాత నిర్మలా మాత్రమే రక్షణమంత్రి బాధ్యతలు చేపట్టారని చెప్పాలి. ఇప్పటి నిర్మలా మాదిరి ఇందిరమ్మ పూర్తిస్థాయి రక్షణ మంత్రిగా వ్యవహరించలేదని చెప్పక తప్పదు. ఏడు దశాబ్దాల స్వతంత్య్ర భారతంలో రక్షణ మంత్రిగా ఒక మహిళ బాధ్యతలు స్వీకరించటం ఇప్పుడు సంచలనంగా మారింది.
నిర్మలా ఎందుకింత సంచలనంగా మారారు. సోషల్ మీడియాలో ఆమెకు జనాలు ఎందుకు నీరాజనాలు పలుకుతున్నారు? లాంటి ప్రశ్నలు వేసుకుంటే.. ఆమె వ్యక్తిత్వం.. ఆమె పనితీరు అన్న సమాధానాలు వస్తాయి. ఎంత ఎదిగినా ఒదిగినట్లుండే నిర్మలా.. నీతిగా..నిజాయితీగా ఉండటం కూడా కలిసొచ్చిన వ్యవహారంగా చెప్పాలి.
మిగిలిన నేతల తరహాకు భిన్నంగా నిర్మలా వర్క్ స్టైల్ ఉంటుంది. ఇంటి దగ్గర ఆమె సగటు గృహిణిలా ఉంటారంటే ఆశ్చర్యపోవాల్సిందే. విడిగా అయితే నమ్మలేం కానీ.. ఒక వీడియో బయటకు రావటం.. ఇంట్లో ఆమె ఎంత సాదాసీదాగా ఉంటారన్న విషయం తెలిసేలా ఉంది. నాలుగేళ్ల కిందట తీసిన ఈ వీడియోలో.. ఇంట్లో తన వాళ్లతో కలిసి అవకాయ పచ్చడి పెడుతున్న వైనం కనిపిస్తుంది. నిజానికి ఆమె ఆవకాయ పెట్టే సమయానికే దేశ రాజకీయాల్లో ఆమెకు చక్కటి పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. తన తల్లితో కలిసి పచ్చడి పెడుతున్న ఈ వీడియోను నిర్మలా భర్త పరకాల ప్రభాకర్ అప్ లోడ్ చేశారు. ఇంకేముంది.. గంటల వ్యవధిలో ఈ వీడియో పెను సంచలనంగా మారి.. వైరల్ అయ్యింది.
Full View