అవిభక్త కవలలుగా నరకం చూస్తున్న వీణా.. వాణిలు విడగొట్టటం సాధ్యమేనని తేల్చారు ఎయిమ్స్ వైద్యులు. కొన్నేళ్లుగా హైదరాబాద్ నీలోఫర్ ఆసుపత్రిలో ఉంటున్న వీరికి శస్త్రచికిత్స చేసి.. ఇద్దరిని వేర్వేరు చేయాలన్న ప్రయత్నాలు గతంలో జరగటం.. అది సాధ్యం కాదన్న మాటతో కొన్నిసార్లు వెనక్కి తగ్గితే.. మరికొన్ని సార్లు వారికి అయ్యే ఖర్చు విషయంలో ప్రభుత్వాలు పెద్దగా రియాక్ట్ కాకపోవటంతో వారిద్దరూ అవిభక్త కవలలుగా ఉండే పరిస్థితి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత.. ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవ తీసుకోవటం.. వీణా.. వాణిల శస్త్రచికిత్సకు ఎంత ఖర్చు అయినా ఫర్లేదని తేల్చటం తెలిసిందే.
అప్పటినుంచి ప్రయత్నాలు మొదలుకాగా.. తాజాగా ఎయిమ్స్ వైద్యులు నీలోఫర్ ఆసుపత్రిని సందర్శించారు. ముగ్గురితో కూడిన వైద్య బృందం నీలోఫర్ వైద్యులతో చర్చలు జరిపి.. వీణా.. వాణిలను పరీక్షించిన తర్వాత వారిని విడదీయటం సాధ్యమేనని తేల్చారు. అయితే.. ఇందుకోసం దాదాపు ఐదు విడతల్లో ఆపరేషన్లు చేయాల్సి ఉంటుందని.. తొమ్మిది నెలల నుంచి ఏడాది వరకూ సమయం పట్టే అవకాశం ఉందని తేల్చారు.
ఇప్పటికే తాము రెండుసార్లు అవిభక్త కవలలకు శస్త్రచికిత్సలు జరిపామని.. వారంతా క్షేమంగా ఉన్నట్లు చెప్పిన వైద్యులు.. వీణా.. వాణిల విషయంలోనూ శస్త్రచికిత్స విజయవంతం అవుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఎయిమ్స్ లో ఆపరేషన్ చేసేందుకు ఉన్న పరిస్థితుల్ని పరిశీలించిన తర్వాత.. లండన్ వైద్యులతో ఎయిమ్స్ డాక్టర్లు మీటింగ్ కానున్నారు. మొత్తానికి వీణా.. వాణిలు విడిపోయే అవకాశం ఉందంటూ వైద్యులు చెబుతున్న మాట వీలైనంత త్వరగా నిజం కావాలని కోరుకుందాం.