రాజధాని గురించి న‌మ్మ‌లేని నిజం

Update: 2015-09-25 09:23 GMT
ప్ర‌పంచ బ్యాంక్ విడుద‌ల చేసిన తాజా నివేదిక దేశ రాజధాని ఢిల్లీ గురించి ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన వాస్త‌వాల‌ను వెల్ల‌డించింది. ప‌ట్ట‌ణీక‌ర‌ణ- ఫ‌లితాలు పేరుతో విడుద‌ల చేసిన ఈ  నివేదిక‌లో దేశంలో అత్యంత వాయు కాలుష్యం గ‌ల న‌గ‌రంగా ఢిల్లీ నిలిచింది. ద‌క్షిణాసియాలోనే కాలుష్యంలో ఢిల్లీ ప్ర‌థ‌మ స్థానంలో ఉంద‌ని ఇది ఢిల్లీ అభివృద్ధికి పెనుస‌వాలుగా మారుతుంద‌ని తాజా నివేదిక హెచ్చ‌రించింది. ప్ర‌పంచంలోని 381 న‌గ‌రాల్లో, ద‌క్షిణాసియాలోని మొత్తం 19 అభివృద్ధి అవుతున్న న‌గ‌రాల్లో ఢిల్లీ స్థానం అత్యంత ప్ర‌మాద‌క‌ర స్థాయిలో ఉంద‌ని స్ప‌ష్టం చేసింది.

బంగ్లాదేశ్ - భారతదేశం - నేపాల్ మరియు పాకిస్తాన్ లో చాలా పేద, అభివృద్ధి చెందుతున్న కాలుష్యం కంటే పట్టణ ప్రాంతాల్లో కాలుష్యం ఎక్కువగా ఉందని పేర్కొంది. కాలుష్యాన్ని లెక్కించే పీఎం సూచిక‌ల ద్వారా కాలుష్యాన్ని సూచించింది. పీఎం 2.5 కాలుష్యం వ‌ల్ల ఊపిరితిత్తుల క్యాన్స‌ర్‌, ఆస్త‌మా, తీవ్రమైన శ్వాసకోశ వ్యాధులు, గుండె జబ్బుల ప్ర‌మాదం ఎక్కువ‌గా ఉంటాయ‌ని స్ప‌ష్టం చేసింది. కాలుష్యం పెరిగేందుకు త‌గ్గ కార‌ణాలు కూడా ఈ నివేదిక‌ వెల్ల‌డించింది. ఇంధ‌నాలు ఎక్కువ‌గా ఉప‌యోగించ‌డం, వాహ‌నాల‌ను విప‌రీతంగా వాడ‌టం, చెట్ల‌ను న‌రికివేయడం వంటివి కాలుష్యం వేగంగా పెరిగేందుకు కార‌ణాలుగా మారుతున్నాయని పేర్కొంది. వ‌ర‌ల్డ్ హెల్త్ ఆర్గ‌నైజేష‌న్ నివేదిక‌లోనూ ఇవే వాస్త‌వాలు వెలువ‌డ్డాయ‌ని ఈ సంద‌ర్భంగా స్ప‌ష్టం చేసింది. ప‌ర్యావ‌ర‌ణానికి పెద్ద‌పీట వేసేలా ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకోకుంటే భ‌విష్య‌త్తులో ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని ఆ నివేదిక‌లో సూచించింది.
Tags:    

Similar News