విషమంగానే ప్రణబ్‌ ముఖర్జీ ఆరోగ్యం !

Update: 2020-08-19 10:30 GMT
మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని ఆయన కుమారుడు అభిజిత్‌ ముఖర్జీ బుధవారం తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్టర్ లో వెల్లడించారు. ‘మీ అందరి ప్రార్థనలు.. డాక్టర్ల ఎనలేని కృషితో మా నాన్న ఆరోగ్యం ఇప్పుడు నిలకడగానే ఉంది. ముఖ్యమైన పారామీటర్స్‌ అన్ని కంట్రోల్‌లోనే ఉన్నాయి. కోలుకుంటున్నట్లు సానుకూల సంకేతాలు వెలువడుతున్నాయి. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థించాల్సిందిగా మీ అందరిని విజ్ఞప్తి చేస్తున్నాను’ అంటూ అభిజిత్‌ ముఖర్జీ ట్వీట్‌ చేశారు.

అలాగే ఢిల్లీ ఆర్మీ ఆసుపత్రి వర్గాలు విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో .. మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జి ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా మారిందని ఆయనకు వైద్యం చేస్తున్న ఢిల్లీ కంటోన్మెంట్‌ ఆస్పత్రి వర్గాలు అధికారిక ప్రకటన విడుదల చేశాయి. ప్రస్తుతం ఆయన ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్నారని తెలిపారు. ఆయన ఇంకా వెంటిలేటర్‌పైనే కొనసాగతున్నట్లు వైద్యులు వెల్లడించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్య నిపుణుల బృందం నిశితంగా పరిశీలిస్తుందని వెల్లడించారు.

ఇకపొతే , ఢిల్లీ కంటోన్మెంట్‌ ప్రాంతంలోని ఆర్మీ ఆసుపత్రిలో ప్రణబ్‌ ముఖర్జీ ఈ నెల 10వ తేదీన అత్యవసర చికిత్స కోసం చేర్చించారు. మెదడులో ఏర్పడ్డ ఒక అడ్డంకిని తొలగించేందుకు ఆయనకు శస్త్ర చికిత్స నిర్వహించారు. అదే రోజు ఆయనకు జరిపిన కరోనా పరీక్షలో పాజిటివ్‌గా నిర్దారణ అయ్యినట్లు వైద్యులు తెలిపారు. దీంతో ఎనిమిది రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
Tags:    

Similar News