హోరాహోరీ ప్రచారం అనంతరం ఢిల్లీ అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికల్లో కీలక ఘట్టం మొదలైంది. ఎన్నికల విజేతను తేల్చే పోలింగ్ ఈ రోజు ఉదయం షురూ అయ్యింది. అయితే.. మరే రాష్ట్ర ఎన్నికల వేళలోనూ లేని రీతిలో ఢిల్లీ అసెంబ్లీ కి జరుగుతున్న ఎన్నికల్లో ఓట్లు వేసేందుకు వచ్చే ఓటర్లకు వినూత్న ఆపర్లను ప్రకటించాయి కంపెనీలు.
ఓటు వేసేందుకు వచ్చే వారి కోసం విమానయాన సంస్థలు మొదలు..పోలింగ్ స్టేషన్లకు చేరుకునేందుకు వీలుగా పలు రవాణా సంస్థలు.. ఓటర్లకు ఉచిత సేవల్ని ప్రకటించటం ఆసక్తికరంగా మారింది.
స్పైస్ జెట్ విషయానికే వస్తే.. ఓటర్ల కు ఉచిత సేవలు అందిస్తున్నట్లు పేర్కొంది. ఈ రోజు ఓటు వేసేందుకు ఢిల్లీకి వచ్చే ఓటర్లలో తమ ఎయిర్ లైన్స్ ను బుక్ చేసుకొని.. ఇవాళే రిటర్న్ జర్నీ చేసే వారికి రెండు టికెట్ల మీద ఉండే బేస్ ఛార్జిని తిరిగి ఇవ్వనున్నట్లు పేర్కొంది. అంతేకాదు.. అభీ బస్ డాట్ కామ్.. ఐ ఓన్ ఐ విన్ పేరుతో వినూత్న ఆపర్ ను ప్రకటించింది.
ఉచిత బస్సు సేవల్ని ప్రకటించింది. ఈ ఆఫర్ ను ఫిబ్రవరి 5న మొదలెట్టి పదో తేదీ వరకూ కొనసాగిస్తున్నట్లు పేర్కొంది. ఇక.. పోలింగ్ వేళ.. ఓటు వేసే ఓటర్ల కు బైక్ - ట్యాక్సీ బుకింగ్ యాప్ రాపిడో.. ఢిల్లీ అసెంబ్లీలో ఓట్లు వేసే వారి కోసం ఫ్రీ రైడింగ్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. మూడు కి.మీ. మేర ఈ రోజు ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకూ ఫ్రీ రైడ్ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు వెల్లడించింది. ఏమైనా.. ఓటర్లు ఓటు వేసేందుకు కంపెనీలు ప్రకటించిన ఫ్రీ ఆఫర్లు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయని చెప్పక తప్పదు.