ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. దీనితో ఎన్నికల పోలింగ్ ముగిసిన మరుక్షణం నుండే పలు సంస్థలు ఎగ్లిట్ పోల్స్ రిజల్ట్స్ ని విడుదల చేస్తున్నాయి. ఇప్పటి వరకు విడుదలైన అన్ని ఎగ్జిట్ పోల్స్ లో మరోసారి ఢిల్లీ పీఠం .క్రేజీ సొంతం కాబోతోంది అని చెప్తున్నాయి. భారీ మెజారిటీ స్థానాలతో అప్ మళ్లీ అధికార పగ్గాలు అందుకుంటుంది అని , క్రేజీ ఎన్నికల ప్రచారం లో ప్రజలపై కురిపించిన వరాల జల్లు కి ఢిల్లీ ప్రజలు దాసోహం అయ్యారు అంటూ తెగ ప్రచారం చేస్తున్నాయి. కానీ ,ఒకవైపు ఎగ్జిట్ పోల్స్ అన్ని అప్ కె పట్టం కడుతున్నా కూడా బీజేపీ నేతలు మాత్రం ఢిల్లీ లో విజయం మాదేనంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
సాధారణంగా ఎన్నికల పోలింగ్ తరువాత గెలుపు మాదేనని.. ప్రతీపార్టీ చెప్తుంది కానీ, ఈ సారి ఢిల్లీకి చెందిన బీజేపీ నేతలు . ఈ ఎన్నికలలో ప్రజల మైండ్ ని పసిగట్టడంతో మొత్తం ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా విఫలమయ్యాయంటున్నారు. ఢిల్లీ పీఠం ఈసారి మాదే అని ఖచ్చితంగా చెప్తున్నారు. ఎన్నికలు జరిగిన తరువాత, ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ వెలువడిన కొద్ది సేపటికే బీజేపీ ఢిల్లీ చీఫ్ మనోజ్ తివారీ రియాక్ట్ అయ్యారు. ఎన్నికల ఫలితాలు విడుదలైన రోజున ఎగ్జిట్‌పోల్స్ విఫలమవుతాయని, బీజేపీ స్పష్టమైన మెజారిటీ తో విజయం సాధిస్తుందని ట్వీట్ చేశారు.
అలాగే, మీకు దీనిపై ఏమైనా అనుమానం ఉంటే, ఈ ట్వీట్ సేవ్ చేసి పెట్టుకోండి. రిజల్ట్ రోజు మాట్లాడండి అంటూ ఆ పోస్ట్‌లో తెలిపారు. అలాగే బీజేపీ మిత్రపక్షమైన అకాలీ దళ్‌కి చెందిన నేత మన్జిందర్ సింగ్ సిర్సా కూడా ఇదే పంథాలో మరో ట్వీట్ చేశారు. ఢిల్లి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయకేతనం ఎగర వేయబోతోందని, ట్వీట్ చేశారు. అంతేకాదు.. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తలకిందులైతాయని, కావాలంటే నేను చేసిన ఈ ట్వీట్ ను స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండంటూ అయన కూడా ధీమా వ్యక్తం చేసారు. చాల స్పష్టమైన ఆధిక్యంతో ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని, ఆ తర్వాత ఈవీఎంలపై ఆరోపణలు చేసేందుకు ప్రయత్నించవద్దంటూ ఆప్ ను ఉద్దేశించి తివారీ అన్నారు. ఇలా బీజేపీకి చెందిన ఇద్దరు కీలక నేతలు విజయం పై ఇంత ధీమా వ్యక్తం చేస్తుండటం తో ఎన్నికల ఫలితాల కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ విఫలమయ్యాయా..?లేక, బీజేపీ నేతలు కావాలనే విజయం మాదే అని ప్రచారం చేస్తున్నారా? అనేది తెలియాలి అంటే రిజల్ట్స్ రోజు వరకు వేచి చూడాల్సిందే...