జగన్ పై చర్యలకు బార్ అసోసియేషన్ డిమాండ్!

Update: 2020-10-14 15:30 GMT
జగన్మోహన్ రెడ్డి పై ఢిల్లీ బార్ అసోసియేషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సుప్రింకోర్టు జస్టిస్ ఎన్వీ రమణ, హైకోర్టు చీఫ్ జస్టిస్ జేకే మహేశ్వరితో పాటు మరో ఆరుగురు జడ్జీలపై జగన్ ఫిర్యాదు చేయటాన్ని తీవ్రంగా తప్పుపట్టింది. న్యాయవ్యవస్ధలోని ప్రముఖులపై జగన్ ఫిర్యాదు చేస్తు సుప్రింకోర్టు చీఫ్ జస్టిస్ ఏఎస్ బాబ్డేకి లేఖ రాయటాన్ని ఖండించింది. జగన్ చర్యలో హేతుబద్దత లేదంటూ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ప్రత్యేక సమావేశం అభిప్రాయపడింది.

జగన్ చర్యలపై చర్చించేందుకు బార్ అసోసియేషన్ సభ్యులు ఈరోజు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. న్యాయమూర్తులపై ఫిర్యాదు చేస్తు జగన్ రాసిన లేఖ ముమ్మాటికి కోర్టు థిక్కారం క్రిందకే వస్తుందని సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. న్యాయవ్యవస్ధపై జనాల్లో నమ్మకాన్ని పోగొట్టేలాగ జగన్ చర్యలు ఉందని సమావేశం అభిప్రాయపడింది. జగన్ ఫిర్యాదు రాజ్యాంగ వ్యవస్ధలపై దాడి చేస్తున్నట్లే ఉందని సమావేశం తీర్మానించింది.

న్యాయమూర్తులపై ఫిర్యాదు చేయటమంటే న్యాయవ్యవస్ధలపై దాడి చేయటంగానే పరిగణించాలంటూ లాయర్లు గట్టిగా చెప్పారు. సీజేఐకి చేసిన ఫిర్యాదును బహిర్గతం చేయటం నీతిమాలిన చర్యగా మండిపడింది. కాబట్టి జగన్ పై కచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే అంటూ సమావేశం డిమాండ్ చేసింది.
Tags:    

Similar News