సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజున ఢిల్లీ మహానగరం తనపై ప్రేమలో పడిందని పేర్కొంటున్నారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. ఆయనలోని కవి హృదయాన్ని అర్థం చేసుకోవాలంటే కాస్త ప్లాష్ బ్యాక్ లోకి వెళ్లాలి. గత ఏడాది ఢిల్లీ రాష్ట్రానికి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుత మెజార్టీతో గెలుపొందటం.. ఢిల్లీ పీఠం మీద కేజ్రీవాల్ చేపట్టటం జరిగిపోయాయి. ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఈ ఫిబ్రవరి 14 నాటికి ఏడాది కావటం.. ఫిబ్రవరి 14 ప్రేమికుల దినోత్సవం కావటంతో కాస్తంత కవితాత్మకంగా ఢిల్లీ మహానగరం తనపై (ఆమ్ ఆద్మీపై) ప్రేమలో పడిందంటూ వ్యాఖ్యానించారు.
ఢిల్లీకి.. ఆమ్ ఆద్మీల బంధం శాశ్వితమైందని.. తమ సర్కారు అధికారాన్ని చేపట్టి ఏడాది పూర్తి అయిన సందర్భాన్ని పురస్కరించుకొని ఢిల్లీ ప్రజలకు థ్యాంక్స్ చెబుతూ ట్వీట్ చేశారు. తమ ఏడాది పాలన పూర్తి అయిన నేపథ్యంలో అమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో ర్యాలీ నిర్వహించనుంది. ఈ సందర్భంగా మరికొన్ని హామీల్ని ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు. మొత్తానికి ఏడాది పాలనకే.. ఢిల్లీ ప్రజలతో తమ బంధం శాశ్వితమని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ చెప్పేయటం చూస్తుంటే.. తొలి వార్షికోత్సవం పేరుతో ఢిల్లీ ప్రజలకు పెద్ద బిస్కెట్ వేస్తున్నట్లుంది.