దేశ రాజధాని ఢిల్లీ రాష్ట్రంలో ఆ రాష్ట్ర సర్కారు సరికొత్త నిర్ణయం తీసుకుంది. పిల్లలు పుట్టే వరకూ ఒక హడావుడి అయితే.. పిల్లలు పుట్టిన నాటి నుంచి వారి స్కూల్ కు సంబంధించి ఆలోచనలతో తల్లిదండ్రులకు టెన్షన్.. టెన్షన్ గా ఉండే పరిస్థితి. పిల్లాడికి రెండున్నరేళ్లు వచ్చిన నాటి నుంచి ఎప్పుడెప్పుడు స్కూలుకు పంపుదామన్న ఆలోచనలో తల్లిదండ్రులు ఉండటం తెలిసిందే. ఇకపై.. అలాంటి ఆతృత ఉన్న తల్లిదండ్రులకు ఢిల్లీ రాష్ట్రంలో మా చెడ్డ ఇబ్బందే.
ఎందుకంటే.. పిల్లల్ని నర్సరీలో చేర్చాలన్నా.. నాలుగేళ్ల వయసు వచ్చే వరకూ ఆడ్మిషన్ ఇవ్వకూడదని తేల్చేశారు. ఇప్పటివరకూ మూడేళ్ల వరకూ పరిమితి ఉన్న స్థానే.. ఇకపై నాలుగేళ్లకు మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ఈ నిర్ణయం అమల్లోకి రానున్న నేపథ్యంలో ప్రైవేటు.. అన్ ఎయిడెడ్ పాఠశాలలు.. ప్రాథమిక స్థాయిల్లో ఆడ్మిషన్లు పొందాలంటే.. మార్చి 31, 2016 నాటికి నర్సరీకి 4ఏళ్లు నిండాలి. అదే ప్రైమరీకి అయితే ఐదేళ్లు.. ఒకటో తరగతికి అయితే ఆరేళ్ల వయసు నిండాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే ఆడ్మిషన్ పొందే వీలుంది. తాజా నిర్ణయంతో.. పిల్లలు కాస్త పెద్ద కాగానే స్కూల్లో ఆడ్మిషన్ల కోసం ప్రయత్నించే వారికి ఇబ్బంది కలగటం ఖాయం. అదే సమయంలో.. తాజా నిర్ణయం కారణంతో సంవత్సరం మధ్యలో పుట్టే పిల్లలు ఇబ్బంది పడే వీలుంది.