లాక్ డౌన్ తో ఆదాయం కోల్పోయిన ప్రభుత్వాలు ఆదాయం కోసం మద్యంధరలు అనూహ్యంగా పెంచేసిన విషయం తెలిసిందే. దేశంలోని చాలా రాష్ట్రాలు భారీగ ధరలు పెంచడంతో మందుబాబులకు షాక్ తగిలింది. దీంతో పేదలు మద్యానికి దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో అధిక ధరలు ఉన్నాయి. అయితే ప్రభుత్వం మద్య నిషేధంలో భాగంగా మద్యం ధరలు పెంచినట్లు చెబుతున్నా.. ధరలు పెరగడంతో మందుబాబులు ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నారు. దీంతో తెలంగాణ వైపు దృష్టి సారించారు. ఈ పరిస్థితి ఇలా ఉండగా.. ఢిల్లీలో కూడా అదే విధంగా ఉంది. అయితే ఇప్పుడు తాజాగా ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మందుబాబులకు కిక్కు ఇచ్చే నిర్ణయం తీసుకున్నారు. మద్యం విక్రయాలపై విధించిన స్పెషల్ ఫీజును ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఢిల్లీ ప్రభుత్వం ఆదివారం ఆదేశాలను జారీ చేసింది.
ఈ ఆదేశాలు ఈ నెల 10వ తేదీ నుంచి అమల్లోకి రాబోతున్నాయి. వైరస్ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని విధించిన 70 శాతం ప్రత్యేక కరోనా ఫీజును ఉపసంహరించుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. సాధారణ ధరలతోనే మద్యం విక్రయాలు కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటిదాకా మద్యం విక్రయాలపై 70 శాతం ప్రత్యేక ఫీజును వసూలు చేసిన విషయం తెలిసిందే. ఎందుకంటే లాక్ డౌన్ తో ఆదాయం కోల్పోవడంతో కొంత పరిస్థితి మెరుగయ్యేందుకు కేజ్రీవాల్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. ఇప్పుడు ఆ ఫీజును రద్దు చేయడంతో మందుబాబులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
మే 5వ తేదీన మద్యం విక్రయాలపై ఢిల్లీ ప్రభుత్వం విధించిన ప్రత్యేక ఫీజును ఇప్పుడు తొలగించనుంది. ఈ కీలక నిర్ణయంతో పాటు మరో నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుంది. దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దులన్నింటినీ ఇక తెరవబోతున్నట్లు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. పొరుగు రాష్ట్రాల నుంచి న్యూఢిల్లీలోకి ప్రవేశించడానికి అందుబాటులో ఉన్న మార్గాలన్నీ సోమవారం (జూన్ 8) నుంచి తెరుస్తున్నట్లు వెల్లడించారు. ఇక షాపింగ్ మాల్స్ - అన్ని ప్రార్థనా మందిరాలు - రెస్టారెంట్లను అందుబాటులోకి తీసుకుని వస్తామని వివరించా. అయితే హోటళ్లు - సమావేశాలను ఏర్పాటు చేసుకోవడానికి నిర్మించిన బంకెట్ హాళ్లను తెరవడానికి అనుమతి ఇవ్వలేదు.