మన దేశంపై బతుకుతూ.. మన సంపాదన యాడ్స్ రూపంలో తీసుకుంటూ.. మన వాళ్లు వాడితే సొమ్ము చేసుకుంటూ కూడా ట్విట్టర్ మన భారతీయులపై.. ఇక్కడి కోర్టులు, ప్రభుత్వాల విషయంలో వ్యవహరిస్తున్న తీరు మాత్రం సగటు నెటిజన్లకు పుండు మీద కారం చల్లినట్టు అవుతోంది. కొద్ది రోజులుగా ట్విట్టర్ వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఇప్పటికే కేంద్రప్రభుత్వంతో ఢీ అంటేఢీ అంటూ ఉపరాష్ట్రపతి నుంచి కేంద్రమంత్రుల వరకు వారి సోషల్ మీడియా ఖాతాలను బ్లాక్ చేసి అవమానిస్తున్న ట్విట్టర్ సంస్థ తాజాగా ఢిల్లీ హైకోర్టుతోనే గేమ్స్ ఆడింది. ఢిల్లీ హైకోర్టు సీరియస్ కావడంతో తోకముడిచింది.
కేంద్రం తీసుకొచ్చిన కొత్త ఐటీ నిబంధనలను ట్విటర్ ఎందుకు పాటించడం లేదంటూ న్యాయవాది ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా.. దీనిపై విచారణ జరిగింది. ఈ సందర్భంగా 'నూతన ఐటీ నిబంధనలను ట్విటర్ ధిక్కారించాలనుకుంటోందా? ' అని ట్విట్టర్ ను ఢిల్లీ హైకోర్టు ప్రశ్నించింది.
దీనికి ట్విటర్ దురుసుగా బదులిచ్చింది. 'ఇప్పటివరకు మేం కొత్త నిబంధనలను అమలు చేయలేదు. అయితే ఆ ప్రక్రియను మొదలుపెట్టాం' అని తెలిపింది. ఫిర్యాదులు స్వీకరించే అధికారిని నియమించామని.. కానీ ఆయన రాజీనామా చేశారని.. కొత్త గ్రీవెన్స్ అధికారిని నియమించాల్సి ఉందని ట్విటర్ తరుఫున న్యాయవాది కోర్టుకు తెలిపారు. ప్రస్తుతం నియామక ప్రక్రియ జరుగుతోందని అన్నారు.
దీనిపై ఢిల్లీ హైకోర్టు సీరియస్ అయ్యింది. 'మీ నియామక ప్రక్రియ ఎప్పటికీ పూర్తవుతుంది? మీకు నచ్చినన్ని రోజులు తీసుకుంటాం అంటే కుదరదు. దీనికి న్యాయస్థానం అంగీకరించదు' అని హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పటిదాకా దేశంలో ట్విటర్ కు ఎలాంటి రక్షణ కల్పించలేమని హైకోర్టు తేల్చిచెప్పింది.
కంపెనీపై కేంద్రానికి చర్యలు తీసుకునే స్వేచ్ఛ ఉందని ట్విటర్ కు షాకిచ్చేలా హైకోర్టు నిర్ణయం తీసుకుంది. భారత్ లో ట్విటర్ కార్యకలాపాలు సజావుగా సాగాలంటే ఏం చేయాలో మాకు తెలుసు అని హైకోర్టు తీవ్రంగా హెచ్చరించింది.