ఇల్లు అన్నాక.. సంతోషాలు మాత్రమే ఉంటాయనుకుంటే తప్పులో కాలేసినట్లే. గొడవలు.. చికాకులు.. పొరపొచ్చాలు లాంటివి ఉండేవి. అయితే.. అవి ఒక మోతాదు దాటితే ఇబ్బందే. తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి చోటు చేసుకుంది. పెద్ద వయస్కులైన అత్తమామలతో గొడవ పడే కోడల్ని.. ఇంటి నుంచి వేరుగా ఉండాలని కోరారు.
అందుకు ఆమె ససేమిరా అనటమే కాదు.. అత్తారింట్లో ఉండటం తన హక్కుగా వాదనకు దిగింది. చివరకు కోర్టును ఆశ్రయించారు కూడా. ఇలాంటి వేళ.. ఈ ఉదంతంపై స్పందించిన ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పును ఇచ్చింది.
సదరు కోడలకు అత్తమామలతో కలిసి ఉండే అవసరం లేదని.. విడిగా ఉండాలన్న సూచన చేసింది. అయితే.. అందుకు తగ్గ ప్రత్యామ్నాయాల్ని చూడాల్సిన బాధ్యత అత్తామామల మీద ఉందని పేర్కొంది. అంతేకాదు.. పెద్ద వయసులో ఉన్న అత్తమామాలకు తమకు నచ్చినట్లుగా ప్రశాంతంగా ఉండే హక్కు ఉందని.. అత్తామామలతోకలిసి కోడలు ఇంట్లో ఉండే హక్కు ఉండదని స్పష్టం చేసింది.
సంచలనంగా మారిన ఈ ఉదంతంలోకి వెళితే.. అత్తమామలతో కలిసి ఉండే కోడలు.. తరచూ వారితో గొడవకు దిగేది. అత్తగారికి 69 ఏళ్లు అయితే.. మామగారికి 74 సంవత్సరాలు. తమ కోడలు ఇంట్లో ఉండటం కారణంగా అకారణంగా గొడవలతో పాటు.. ఆమె కారణంగా తాము ప్రశాంతంగా ఉండలేకపోతున్నామని.. ఆమెను ఇంటినుంచి వెళ్లాలని కోరారు.
దీనికి ఆమె వ్యతిరేకిస్తూ.. కోర్టును ఆశ్రయించి.. కోడలుగా అత్త..మామల ఇంట్లో ఉండే హక్కు ఉందని వాదించింది. దీనిపై విచారించిన కోర్టు.. ఆ హక్కు కోడలికి ఉండదని తేల్చి చెప్పింది. దీంతో సమాధానపడని సదరు కోడలు.. ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది.
ఈ కేసును విచారించిన జస్టిస్ యోగేష్ ఖన్నా విచారణ చేపట్టారు. ఇరు వర్గాల వాదనలు విన్న అనంతరం.. కోడలు బయటకు పంపేందుకు అత్త మామలకు అధికారంలో ఉంటుందని.. అందుకు కారణంగా కోడలి ప్రవర్తనే కారణమని తేల్చారు. అంతేకాదు.. అత్తమామలు సీనియర్ సిటిజన్లు అని.. వారు ప్రశాతంతంగా జీవించటానికి అర్హులుగా పేర్కొంది.
అందుకు వారి కుమారుడు.. కోడలు అడ్డంకి కాకూడదని స్పష్టం చేసింది. గ్రహ హింస చట్టంలోని సెక్షన్ 19(1)ఎఎఫ్ ప్రకారం మహిళల రక్షణ కోసం పిటిషనర్ (కోడలు)కు ప్రత్యామ్నాయ నివాస వసతి కల్పించాలని స్పష్టం చేసింది.
ప్రస్తుతం కొడుకు.. కోడలు అద్దె ఇంట్లో ఉంటున్నారు. ఇదిలా ఉంటే.. ఉమ్మడి కుటుంబంలో ఉండటం ఎట్టి పరిస్థితుల్లోనూ హక్కు కిందకు రాదని.. అత్తమామల్ని ఇబ్బంది పెడుతున్న కోడలితో వారు కలిసి ఉండాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. చివరి దశలో ప్రశాంతంగా ఉండాలనేుకుంటే కొడుకు కోడులు వేరే ఇంట్లో ఉండాలని తీర్పును ఇచ్చారు.
అయితే.. కొడుకుతో వివాహ బంధం ఉన్నంత వరకు కోడలికి ప్రత్యామ్నాయ నివాస ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేస్తూ కోడలు దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టేస్తూ నిర్ణయం తీసుకుంది. సో.. అత్తారింట్లో ఉండే కోడళ్లు.. హద్దులు మీరి గొడవలు పెట్టుకుంటే.. చట్టం పెద్ద వయస్కులైన అత్తా మామలకు దన్నుగా ఉంటుందన్న విషయం తాజా తీర్పు స్పష్టం చేసిందని చెప్పాలి.