చెప్పే నీతులకు.. చేసే పనులకు ఏ మాత్రం సంబంధం లేని ప్రభుత్వాలు కొన్ని ఉంటాయి. అదిరేలా ఆదర్శాలు వల్లించే దానికి భిన్నంగా నిర్ణయాలు తీసుకోవటంలో ఢిల్లీలోని అమ్ ఆద్మీ సర్కారుకు మించింది లేదన్న భావన కలగటం ఖాయం. దీనికో కారణం లేకపోలేదు. తాజాగా హాట్ టాపిక్ గా మారిన ఈ వ్యవహారంపై ఢిల్లీ లెఫ్టెనెంట్ గవర్నర్ అనిల్ జైజాల్ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు.
విరుచుకుపడుతున్న మహమ్మారి కారణంగా దేశంలోని పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇలాంటివేళ.. మరే రాష్ట్రంలో అమలు కాని సిత్రమైన నిబంధనను తీసుకొచ్చారు. దాని సారాంశం ఏమంటే.. ఢిల్లీలో ఢిల్లీయేతర రాష్ట్రాలకు చెందిన పాజిటివ్ రోగులకు ఆసుపత్రుల్లో చికిత్స చేయకపోవటం. ఢిల్లీ లోకల్స్ కు మాత్రమే ఢిల్లీలో చికిత్స చేయాలంటూ ఆఫ్ సర్కారు నిర్ణయం తీసుకుంది.
ఈ వివాదాస్పద నిర్ణయాన్ని కొట్టేస్తూ అనిల్ జైజాల్ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇదెక్కడి రూల్ అంటూ ఆయన దీన్ని కొట్టేస్తున్నారు. సరైన సమయంలో ఏ మాత్రం ఆలస్యం కాకుండా తీసుకున్న ఈ నిర్ణయంపై పలువురు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మరోవైపు.. ఆప్ ప్రభుత్వం మాత్రం లెఫ్టెనెంట్ గవర్నర్ నిర్ణయాన్ని తప్పు పడుతోంది. దేశ రాజధానిలోకేసులు పెరుగుతున్న వేళ.. ఆసుపత్రుల్లోని బెడ్స్ సరిపోకపోతే.. మరిన్ని వసతులు కల్పించాల్సింది పోయి.. ఢిల్లీ లోకల్స్ కాని వారికి చికిత్స చేయకపోవటానికి మించిన అమానుషం ఏముంటుందన్న మాట వినిపిస్తోంది. ఇప్పటివరకూ డిల్లీలో 28,936 కేసులునమోదైతే.. 812 మంది ఇప్పటివరకూ మరణించారు.
మాయదారి రోగం విజృంభిస్తున్న వేళలో ప్రభుత్వ నిర్ణయానికి భిన్నంగా లెఫ్టినెంట్ గవర్నర్ తీసుకున్న నిర్ణయాన్ని కేజ్రీవాల్ సర్కార్ తప్పు పడుతోంది. కేసులు పెరుగుతున్న వేళ.. వైద్య సేవలు అందించటం కష్టమవుతుందన్నది వారి వాదన. అదే నిజమై.. దేశంలోని అన్ని రాష్ట్రాల వారు వారి స్థానికులకు ప్రాధాన్యమిచ్చి.. మిగిలిన వారిని వదిలేయాలన్న నిర్ణయాన్ని తీసుకుంటే ఎలా ఉంటుందన్నది ఊహించటమే కష్టం. అలాంటిది ఏకంగా నిర్ణయం తీసుకోవటం పై విస్మయం వ్యక్తమవుతోంది.