రెచ్చ‌గొట్టే వ్యాఖ్య‌ల ఫ‌లితం: ‌ఢిల్లీ మైనార్టీ క‌మిష‌న్ చైర్మ‌న్‌ పై దేశ‌ద్రోహం

Update: 2020-05-02 17:30 GMT
సోష‌ల్ మీడియాలో విద్వేష‌పూరిత వ్యాఖ్య‌లు - పోస్టులు - వీడియోలు పెట్టిన వారిపై ప్ర‌భుత్వం క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటున్న విష‌యం తెలిసిందే. అది ఎంత‌వారైనా స‌రే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. ఈ క్ర‌మంలో రెచ్చ‌గొట్టే వ్యాఖ్య‌లు చేసినందుకు ఢిల్లీ మైనారిటీస్‌ కమిషన్‌ చైర్మన్‌ జఫారుల్ ఇస్లాం ఖాన్‌ పై దేశదేహ్రం కింద కేసు నమోదు చేశారు. ఈ విష‌యాన్ని ఢిల్లీ స్పెషల్‌ పోలీస్‌ విభాగం ప్ర‌క‌టించింది. ఇటీవ‌ల ఇస్లాం సోషల్‌ మీడియా వేదికగా ఆయ‌న రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశార‌ని తెలిపింది. దీంతో అతడిపై సెక్షన్‌ 124 ఏ (దేశద్రోహం) - సెక్షన్‌ 153 ఏ (జాతి వివక్ష వ్యాఖ్యలు) కింద కేసులు నమోదు చేసినట్లు ఆ విభాగం ఢిల్లీ జాయింట్‌ పోలీస్‌ కమిషనర్‌ నీరజ్‌ ఠాకూర్ వెల్ల‌డించారు. అత‌డిపై వసంత్‌ కంజ్‌ ప్రాంతానికి చెందిన వ్య‌క్తి ఫిర్యాదు చేయ‌డంతో ఈ మేర‌కు  జఫారుల్‌ పై ఎఫ్‌ ఐఆర్‌ నమోదు చేశారు.

ఏప్రిల్ 28వ తేదీన జ‌ఫారుల్ సోషల్‌ మీడియా (ట్విటర్‌ - ఫేస్‌ బుక్‌)లో మతాలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశార‌ని - మ‌త సామ‌ర‌స్యానికి విఘాతం క‌లిగించేలా - సమాజంలో చీలికను తెచ్చేలా అతడి వ్యాఖ్యలు ఉన్నాయని ఫిర్యాదుదారుడు పేర్కొన్నారు. అత‌డు చేసిన వ్యాఖ్య‌లు మత విద్వేషానికి దారి తీసేలా ఉన్నాయి. అత‌డు చేసిన‌ వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి.

దేశాన్నిమోసం చేసి పారిపోయిన నేరస్తుడి పేరు అత‌డు తన వ్యాఖ్యల్లో‌ ప్రస్తావించారు. దీన్ని గ‌మ‌నించిన అధికారుల అభ్యర్థన మేరకు ఇంటర్పోల్ ఇప్పటికే ఆ నేరస్థుడి మీద రెడ్ కార్నర్ నోటీసు జారీ అయింది. అతడిపై చట్టవిరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం (యూఏపీఏ) - మనీలాండరింగ్ - టెర్రర్ సంబంధిత కేసుల కింద బుక్ చేసింది. అలాంటి వ్యక్తిని జఫారుల్‌ ప్రశంసించడం దేశద్రోహం కిందే లెక్కగడతారని ఫిర్యాదులో తెలిపారు.

అయితే ఈ వార్త‌పై ఢిల్లీ మైనారిటీస్‌ కమిషన్‌ చైర్మన్‌ జఫారుల్ ఇస్లాం ఖాన్ స్పందించారు. తనపై ఎఫ్‌ ఐఆర్‌ నమోదైందన్న వార్తలు అవాస్తవమని కొట్టిపారేశారు. ఎఫ్‌ ఐఆర్‌ నమోదైందని తన దృష్టికి వచ్చేంతవరకు ఈ విషయాన్ని నమ్మనని తెలిపారు. అయితే ఆ విధంగా చేసిన వ్యాఖ్య‌ల‌పై ఆయ‌న క్షమాపణలు కోరారు. తాను చేసిన వ్యాఖ్య‌ల‌ను కొంద‌రిని బాధించిన విష‌యం తెలిసింది. ఏ ఒక్కరిని కించపరిచాలనే ఉద్దేశం త‌న‌కు లేదని - ఏదైనా తప్పు చేసి ఉంటే క్షమించాల‌ని అత‌డి ట్విట‌ర్‌ లో తెలిపారు.
Tags:    

Similar News