కేజ్రీవాల్ కే జలక్ ఇచ్చిన లేడీ ఎమ్మెల్యే

Update: 2019-09-06 10:14 GMT
ఆల్కా లంబా.. ఆమ్ ఆద్మీ పార్టీలో తిరుగుబాటు ఎమ్మెల్యేగా అందరికీ సుపరిచితం.. తన దూకుడు, దుందుడుకు చర్యలతో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత క్రేజ్రీవాల్ ఆగ్రహానికి గురయ్యారామే..

గత సార్వత్రిక ఎన్నికల్లో ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఘోర పరాజయం పాలైంది. దీనికి నైతిక బాధ్యత వహించి కేజ్రీవాల్ రాజీనామా చేయాలని ఆల్కాలంబా బాహటంగా చేసిన ప్రకటన చిచ్చు రేపింది. వెంటనే ఆమెను ఆమ్ ఆద్మీ వాట్సాప్ గ్రూపు నుంచి పార్టీ అధ్యక్షుడు కేజ్రీవాల్ తొలగించారు.  ఆ తర్వాత ట్విట్టర్ లోనూ అన్ ఫాలో చేశారు. దీంతో పొమ్మనలేక పొగబెడుతున్నారంటూ ఆల్కాలంబా కొంతకాలంగా ఆప్ ను లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేస్తోంది.

తాజాగా తాను ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టుకొని ఆమ్ ఆద్మీ పార్టీలో ఉండలేనంటూ ఆ పార్టీని వీడుతున్నానంటూ ఆల్కాలంబా ప్రకటించింది. కేజ్రీవాల్ పై విమర్శలు చేస్తూ పార్టీని వీడి జలక్ ఇచ్చింది.  అయితే దమ్ముంటే రాజీనామా చేసి వెళ్లాలని ఆప్ అధికార ప్రతినిధి సౌరభ్ భరద్వాజ్ సవాల్ చేశారు..

ఈ నేపథ్యంలో ఆమె ఆప్ పార్టీకి  - ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ కాదని.. ఇది ఖాస్ ఆద్మీ పార్టీ అంటూ ఆల్కా లంబా విమర్శించారు. అయితే ఇటీవలే సోనియాగాంధీని కలిసిన ఆమె వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తరుఫున పోటీచేసేందుకే ఆమ్ ఆద్మీ  పార్టీని వీడినట్టు తెలుస్తోంది.
    

Tags:    

Similar News