కేజ్రీవాల్ ఫస్ట్ డే కలెక్షన్స్ రూ.4 లక్షలు

Update: 2016-01-02 10:38 GMT
దేశ రాజధానిలో కాలుష్యాన్ని నివారించడానికి చేపట్టిన సరి-బేసి సంఖ్యల విధానం కాలుష్య నివారణతోపాటు స్వల్పంగా ఆదాయ మార్గంగానూ ఉంటోంది. నిబంధనలు ఉల్లంఘించినవారికి రూ.2 వేలు జరిమానా విధిస్తుండడంతో తొలిరోజున బాగానే జరిమానా వసూలైంది.
    
సరి బేసి సంఖ్యల విధానం అమలు చేశాక తొలి రోజున  203 మంది నిబంధనలు పాటించకుండా ట్రాఫిక్ పోలీసులకు బుక్కయ్యారు. వారి నుంచి రూ. 4.06 లక్షల జరిమానా వసూలు చేశారు. జనవరి 1 నుంచి 15వ తేది వరకు ఢిల్లీ నగరంలో సరి-బేసి కార్ల ప్రయోగం చేపట్టారు. శుక్రవారం ఉదయం నుంచి రాత్రి 8 గంటల వరకు నగరంలోని పలు జంక్షన్లు - సర్కిల్స్ - ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర పోలీసులు వాహనాలు నిలిపి పరిశీలించారు. అందులో నియమాలు ఉల్లంఘించి రోడ్ల మీదకు వాహనాలు తీసుకు వచ్చిన వారిని గుర్తించారు. నియమాలు ఉల్లంఘించిన 138 మందిని ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు పట్టుకున్నారు. మరో 65 మందిని ఢిల్లీ రవాణా శాఖ అధికారులు పట్టుకున్నారు.
    
మరోవైపు ఆటో డ్రైవర్లు ఇదే మంచి చాన్స్ అంటూ మీటర్లు వెయ్యకుండా ప్రయాణికుల దగ్గర అధిక మొత్తంలో చార్జీలు వసూలు చేశారు. విషయం తెలుసుకున్న పోలీసు, రవాణా శాఖ అధికారులు 76 మంది ఆటో డ్రైవర్లను గుర్తించి జరిమానా వసూలు చేశారు. సరి సంఖ్య ఉన్న వాహనాలు ఇంటి దగ్గరే వదిలిపెట్టాల్సి రావడంతో ఆటో లో ప్రయాణించడానికి చాల మంది సిద్దం అయ్యారు. అయితే ఆటో డ్రైవర్లు ప్రయాణికుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని దోచుకుంటున్నారని ఫిర్యాదులు వస్తున్నాయి.
Tags:    

Similar News