చిన్న‌మ్మ మేన‌ల్లుడికి లుక్ ఔట్ నోటీసులు

Update: 2017-04-19 06:02 GMT
చిన్న‌మ్మ టైం ఏమాత్రం బాగోలేదు. అతిగా ఆశ ప‌డి.. అధికారం మొత్తాన్ని త‌న చెప్పుచేత‌ల్లోకి తీసుకోవాల‌ని అనుకున్న ఆమె ఆశ‌లు కొంత‌మేర తీరినా.. అక్క‌డితో సంతృప్తి చెంద‌ని ఆమె అత్యాశ మొద‌టికే మోసం తెచ్చేసింది. పార్టీ రెండుగా చీలిన వేళ‌.. ఆచితూచి అడుగులు వేయాల్సిన‌ప్ప‌టికీ.. అత్యాశ‌తో.. డ‌బ్బు అహంకారంతో చేసిన ప్ర‌య‌త్నాలు మొద‌టికే మోసం తెచ్చేలా చేశాయి.

పార్టీ చీలిక నేప‌థ్యంలో.. పార్టీ గుర్తు అయిన రెండాకుల్ని త‌మ వ‌ర్గానికే కేటాయించాలంటూ చిన్న‌మ్మ మేన‌ల్లుడు దిన‌క‌ర‌న్ ఎన్నిక‌ల సంఘ అధికారి ఒక‌రికి రూ.60 కోట్ల లంచాన్ని ఇవ్వ‌జూపార‌న్న ఆరోప‌ణ అత‌డి మెడ‌కు చుట్టుకుంది. సుఖేశ్ చంద్ర‌శేఖ‌ర్ అనే ద‌ళారిని అదుపులోకి తీసుకున్న ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు త‌మ విచార‌ణ‌లో ఈ విష‌యాన్ని బ‌య‌ట పెట్టారు.

అయితే.. సుఖేశ్ చంద్ర‌శేఖ‌ర్ ఎవ‌రో త‌న‌కు తెలీద‌ని.. ఆ పేరు తాను విన‌లేద‌ని దిన‌క‌ర‌న్ చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఆయ‌న‌పై లుక్ ఔట్ నోటీసుల్ని జారీ చేసిన‌ట్లుగా ఢిల్లీ జాయింట్ క‌మిష‌న‌ర్ మీడియాకు వెల్ల‌డించారు. దేశంలోని అన్ని ఎయిర్ పోర్టులు.. ఓడ‌రేవుల‌కు దిన‌క‌ర‌న్ వివ‌రాలు పంపిన‌ట్లుతెలిపారు. ఆయ‌న కానీ విమానం ఎక్కేందుకు వ‌స్తే.. వెంట‌నే పోలీసుల‌కు స‌మాచారం అందించాల‌ని కోరుతూ ఇమ్మిగ్రేష‌న్ అధికారుల‌ను ఆదేశించిన‌ట్లుగా జాయింట్ క‌మిష‌న‌ర్ చెబుతున్నారు. ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల్లో ఎప్పుడైనా దిన‌క‌ర‌న్‌ ను అరెస్టు చేయొచ్చ‌ని.. అందుకోసం ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లుగా తెలుస్తోంది. మ‌రోవైపు.. తాజా ప‌రిస్థితుల్లో దేశం విడిచి పారిపోయేందుకు ఆయ‌న ప్ర‌య‌త్నాలు చేసే అవ‌కాశం ఉంద‌న్న మాట కూడా వినిపిస్తోంది. ఇదిలా ఉంటే.. అన్నాడీఎంకేలోని రెండు చీలిక వ‌ర్గాలు క‌లిసిపోయి.. చిన్న‌మ్మ‌.. అండ్ ఫ్యామిలీని దూరంగా పెట్టాల‌న్న సంచ‌ల‌న నిర్ణ‌యాన్ని తీసుకున్న వేళ‌లోనే అనూహ్యంగా చోటు చేసుకుంటున్న ప‌రిణామాల‌తో త‌మిళ‌నాడు రాజ‌కీయం ఒక్క‌సారిగా వేడెక్కాయ‌ని చెప్పాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News