గడిచిన కొంతకాలంగా చిన్నమ్మ మేనల్లుడు దినకర్ టైం ఏం బాగోలేదు. ఒకప్పుడు ఎంత పడితే అంత చెలరేగిపోయినా నడిచిన కాలం.. ఇప్పుడు ఎంత తగ్గుతానని చెబుతున్నా.. అస్సలు ఊరుకోవటం లేదు. షాకుల మీద షాకులిస్తూ.. ఆయన్ను ఉరికించి.. ఉరికించి ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. పార్టీ రెండాకుల గుర్తు కోసం కేంద్ర ఎన్నికల సంఘం సభ్యుడికి రూ.50 కోట్ల భారీ లంచం ఇచ్చే ప్రయత్నం చేసిన విషయానికి సంబంధించిన పక్కా ఆధారం లభించిన వేళ.. ఆయనపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.
అధికారులు చెబుతున్న వ్యక్తికి.. తనకు ఏ మాత్రం సంబంధం లేదని దినకరన్ చెబుతున్నా.. అదంతా ఉత్త బుకాయింపేనని చెబుతున్నారు. మరోవైపు.. పార్టీ నుంచి గెంటేసేందుకు పక్కా ప్లాన్ సిద్ధం చేసిన మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం దెబ్బకు క్లీన్ బౌల్డ్ అయిన దినకరన్.. తాను పార్టీ నుంచి తప్పుకునేందుకు సిద్ధమయ్యారు. ఇలా షాకుల మీద షాకులు తగులుతున్న దినకరన్ కు తాజాగా మరో షాక్ తగిలింది.
బుధవారం అర్థరాత్రి వేళ.. ఢిల్లీ పోలీసులు ఆయనకు సమన్లు జారీ చేశారు. రెండాకుల గుర్తు కోసం ఎన్నికల కమిషన్‌కు లంచం ఇవ్వచూపారన్న ఆరోపణ విషయంలో విచారణ కోసం ఢిల్లీకి రావాలంటూ ఢిల్లీ పోలీస్ టీం సమన్లు జారీ చేసింది. ఎసీపీ ర్యాంకు అధికారి.. ఆయ క్రైం బ్రాంచ్ టీం చెన్నైలోని దినకరన్ నివాసానికి వచ్చి మరీ.. ఆయనకు నోటీసులు అందించారు. దీంతో.. ఆయన విచారణకు ఢిల్లీకి వెళ్లాల్సిన పరిస్థితి. నిజానికి బుధవారం ఉదయం ఆయన దేశం విడిచి పారిపోకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా లుక్ అవుట్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు తాను ఎక్కడికి వెళ్లనని.. తన పాస్ పోరట్ గడిచిన 20 ఏళ్లుగా కోర్టులోనే ఉందని.. తాను విదేశాలకు ఎలా వెళ్లగలనని ఆయన ప్రశ్నిస్తున్నారు. మొత్తంగా.. తాజా కేసు గండం నుంచి దినకరన్ ఎలా బయటపడతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పక తప్పదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/