ఢిల్లీలో 31 దాకా థియేటర్లు క్లోజ్, పరీక్షలు బంద్, ఖాళీ స్టేడియాల్లో ఐపీఎల్
చైనాలోని వూహాన్ లో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఈ ప్రాణాంతక వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా 4,638 మంది మృత్యువాత పడ్డారు. 126,258 మందికి వ్యాప్తించింది. ప్రపంచవ్యాప్తంగా వందకు పైగా దేశాలకు విస్తరించింది. ఈ వైరస్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) బుధవారం మహమ్మారీగా ప్రకటించింది. అప్పటికే ఈ వైరస్ కారణంగా కుదేలైన మార్కెట్లు, WHO ప్రకటనతో కుప్పకూలాయి. భారత్, అమెరికా, జపాన్, సౌత్ కొరియా.. అన్ని దేశాల మార్కెట్లు పాతాళంలోకి జారాయి. దలాల్ స్ట్రీట్‌లో సెన్సెక్స్ ఏకంగా దాదాపు 3వేలు పతనమైంది.
ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఇస్తున్నాయి. ఢిల్లీలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్కూళ్లు, కాలేజీల్లో మార్చి 31వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించరాదని నిర్ణయించింది. సినిమా హాల్స్‌ను కూడా మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రధానంగా జనసమూహాలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఈ ఆదేశాలిచ్చింది. భారత్‌లో కరోనా కేసులు 73కు చేరుకున్నాయి.
ముంబై, హైదరాబాద్, బెంగళూరు సహా వివిధ ప్రాంతాల్లో మెట్రో రైళ్లు జనాలు లేక వెలవెలలాడుతున్నాయి. ప్రజా రవాణా వ్యవస్థను ఆశ్రయించేందుకు జనాలు ఆసక్తి చూపించడం లేదు. గుంపులుగా ఉన్నచోటకు వెళ్లడం లేదు. విమానాశ్రయాలు బోసిపోతున్నాయి. ఎయిర్ లైన్స్ ఆదాయం దాదాపు 70 శాతం పడిపోయింది. పర్యాటక రంగంపై భారీ ప్రభావం పడింది. హోటళ్లపై దాదాపు 50 శాతం ప్రభావం పడింది.
కరోనా వైరస్ ప్రభావం క్రీడా రంగంపై కూడా పెను ప్రభావమే చూపిస్తోంది. భారత్ - సౌతాఫ్రికా మధ్య మరో రెండు వన్డేలు ఉన్నాయి. ఇవి ఖాళీ స్టేడియాల్లో జరిగే అవకాశాలు ఉన్నాయి. మార్చి 15న లక్నో, 18న కోల్‌కతాలో మ్యాచ్‌లు ఉన్నాయి. రద్దు చేయలేని లేదా వాయిదా వేయలేని పోటీలను ఖాళీ స్టేడియాల్లో నిర్వహించాలని బీసీసీఐ సహా అన్ని క్రీడా సమాఖ్యలకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ప్రజలంతా ఒకేచోటకు చేరకుండా అడ్డుకోవాలని తెలిపింది. సౌరాష్ట్ర, బెంగాల్ మధ్య జరగనున్న రంజీట్రోపీ ఫైనల్ చివరి రోజున గ్రౌండ్‌లో కి అభిమానులను అనుమతించేది లేదని బీసీసీఐ స్పష్టం చేసింది. మరో ఆసక్తికరం ఏమంటే ఐపీఎల్ 2020 కూడా ఖాళీ స్టేడియాల్లో నిర్వహించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.