భ‌గ‌త్ సింగ్‌ ను ఉగ్ర‌వాది చేసిన టెక్స్స్ బుక్‌

Update: 2016-04-27 10:35 GMT
దేశంలో కొన్ని వ‌ర్గాలు అనుస‌రిస్తున్న తీరు ఇప్ప‌టికే వివాదాస్ప‌ద‌మ‌వుతున్న తరుణంలో ఢిల్లీ యూనివ‌ర్సిటీ పాఠ్య పుస్త‌కంలో ష‌హీద్ భ‌గ‌త్ సింగ్‌ ను ఉగ్ర‌వాదిగా పేర్కొన‌డం ఇప్పుడు తీవ్ర సంచ‌ల‌నం రేపుతోంది. ఢిల్లీ యూనివర్శిటీ ప్రచురించిన ఒక పాఠ్య పుస్త‌కంలో దేశం కోసం ప్రాణాలర్పించిన భగత్‌ సింగ్‌ ను విప్లవ ఉగ్రవాది అని రాయ‌డం వివాదాస్పదమైంది.

ఢిల్లీలోని జేఎన్ యూలో ఉగ్ర‌వాది అప్ఝ‌ల్ గురుకు అనుకూలంగా కార్య‌క్ర‌మాలు నిర్వహించ‌డం.. అనుకూలంగా నినాదాలు చేయ‌డం తెలిసిందే. ఈ పెడ‌ధోరణుల‌పై ఇప్ప‌టికే దేశ‌వ్యాప్త చ‌ర్చ జ‌రుగుతున్న త‌రుణంలో భ‌గ‌త్ సింగ్‌ ను ఉగ్ర‌వాదిగా పేర్కొన‌డం.. అది కూడా పాఠ్య పుస్త‌కంలో అలా రాయ‌డంపై దేశ‌భ‌క్తులు మండిప‌డుతున్నారు. దేశాన్ని క‌బ‌ళించాల‌ని ప్ర‌య‌త్నించిన ఉగ్ర‌వాదుల‌ను పూజిస్తూ.. దేశం కోసం ప్రాణాల‌ర్పించిన‌వారిని ఉగ్ర‌వాదులుగా చిత్రీక‌రిస్తారా అన్న విమ‌ర్శ‌లొస్తున్నాయి.

భగత్‌సింగ్‌ మేనల్లుడు అభయ్‌ సింగ్‌ సంధు దీనిపై తీవ్రంగా స్పందించారు. స్వాతంత్య్రం లభించిన 68 సంవత్సరాల తరువాత కూడా దేశంకోసం ప్రాణాలర్పించిన వారిని ఈ విధంగా పేర్కొనడం బాధాక‌ర‌మ‌ని అంటున్నారు. ఆంగ్లేయులు కూడా తమ తీర్పులో భగత్‌ సింగ్‌ ను 'నిజమైన విప్లవకారుడు' అని సంబోధించారే తప్ప ఉగ్రవాదిగా అన‌లేద‌ని ఆయ‌న ఆవేద‌న చెందుతున్నారు. కాగా పాఠ్య‌పుస్త‌కంలో జ‌రిగిన ఈ పొర‌పాటుకు కార‌ణాల‌పై విచార‌ణ మొద‌లైంది.
Tags:    

Similar News