బర్త్ డే వేళ.. ప్రతి ఆర్డర్ కు చాక్లెట్ ఇస్తూ సెలబ్రేట్ చేసుకున్న డెలివరీ బాయ్

Update: 2023-07-01 09:45 GMT
తనకు స్పెషల్ రోజైన తన పుట్టిన రోజు ను అందరితో కలిసి చేసుకోవాలన్న ఆలోచనతో ఒక డెలివరీబాయ్ చేసిన పని సోషల్ మీడియా లో ఆసక్తికర చర్చగా మారింది. అతడి వివరాలు వైరల్ గా మారాయి. అంతేకాదు.. అతగాడు పని చేస్తున్న పనిని గురించి తెలిసిన కంపెనీ అతడ్నికి ఊహించని గిప్టుపంపి తను కూడాసర్ ప్రైజ్ చేసింది. ఈ క్యూట్ ఉదంతం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

జొమాటో లో పుడ్ డెలివరీ బాయ్ గా పని చేసే కరణ్ అప్టే అనే 30 ఏళ్ల యువకుడు తన పుట్టిన రోజు సందర్భంగా కొత్త షర్టు కొనుక్కున్నాడు. అనంతరం ఆ రోజున తాను డెలివరీ చేసే ప్రతి ఫుడ్ ఫ్యాక్ కు ఒక చాక్లెట్ ను జత చేసి ఇవ్వటం షురూ చేశాడు. అలా తాను డెలివరీ చేసిన రెండు ప్యాక్ లకు చాక్లెట్ ను కలిపి ఇచ్చిన వైనాన్ని సోషల్ మీడియా లో పోస్టు పెట్టి.. దానికి జతగా ఫోటోల్ని షేర్ చేశారు.

ఈ డెలివరీ బాయ్ చేసిన పనికి సోషల్ మీడియా లోని నెటిజన్లు సానుకూలంగా స్పందించారు. అతడి పోస్టు ను షేర్ చేశారు. ఈ క్రమంలో ఒకరు సదరు డెలివరీ బాయ్ పని చేసే జొమాటో కు ఈ పోస్టును ట్యాగ్ చేశారు. తమ డెలివరీ బాయ్ చేసిన పనిని గుర్తించి.. అతడికి స్పెషల్ గా ఒక కేక్ పంపి సర్ ప్రైజ్ చేశారు. దీంతో.. ఆ కేసు ను సోషల్ మీడియా లో షేర్ చేసి.. తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ ఉదంతం ఆసక్తికరంగా మారి.. అందరిని ఆకర్షిస్తోంది.

Similar News