ప్రపంచాన్ని ఇప్పుడు 'ఒమిక్రాన్' కొత్తరకం కరోనా వైరస్ భయపెడుతోంది. ఇప్పటికే యూరప్ లో పలు దేశాలు దీని ధాటికి లాక్ డౌన్ దిశగా సాగుతున్నాయి. వేలల్లో కేసులు నమోదవుతున్నాయి. మరణాలు మొదలయ్యాయి. దీంతో ఆంక్షలు పెడుతున్నారు.
గత రెండేళ్లుగా ప్రపంచాన్ని కరోనా ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కోవిడ్ భయాలు తగ్గుముఖం పడుతున్న వేళ 'ఒమిక్రాన్' రూపంలో మళ్లీ ఈ మహమ్మారి ఉరుముతుండడం జనావళిని భయపెడుతోంది.
ఇప్పటికే దాదాపు 89 దేశాలకు పాకిన ఈ కొత్త వేరియంట్ బ్రిటన్ ను వణికిస్తోంది. నిన్న ఒక్కరోజే అక్కడ ఏకంగా 10వేల ఒమిక్రాన్ కేసులు రావడం కలవరపెడుతోంది. డిసెంబర్ 8న బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఆంక్షలు ప్రకటించడంతోనే తొలి ఒమిక్రాన్ మరణం కూడా సంభవించింది. తాజాగా ఆ సంఖ్య 12కి చేరడంతో క్రిస్మస్ వేడుకలపై కఠిన ఆంక్షల దిశగా ఆలోచిస్తున్నారు.
ఇక అమెరికాను ఓ వైపు ఒమిక్రాన్, మరోవైపు డెల్టా వైరస్ భయపెడుతోంది. అమెరికాలో ఇప్పటికే డెల్టా వేరియంట్ ఉధృతి అధికంగా ఉండగా.. తాజాగా వేగంగా విస్తరించే ఒమిక్రాన్ వేరియంట్ ఆందోళన కలిగిస్తోంది. కోవిడ్ రోగులతో అక్కడి ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి.
గత వారం రోజుల్లోనే అమెరికాలో 8.5 లక్షల మందికి వైరస్ సోకగా.. 8వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇక ఇప్పటివరకూ 61శాతం జనాభాకు పూర్తిస్థాయిలో వ్యాక్సినేషన్ జరిగింది. వ్యాక్సిన్ వేసుకోని వారే అధికంగా ఆస్పత్రిలో చేరుతున్నట్టు వైద్యులు చెబుతున్నారు.
గతంలో రెండు వారాల వ్యవధిలోనే కాలిఫోర్నియాలో కోవిడ్ కేసులు 47శాతం పెరగడంతో ఈ నిర్ణయం జనవరి 15 వరకూ మాస్క్ , భౌతిక దూరం తప్పనిసరి చేశారు. క్రిస్మస్ సెలవులకు దూరంగా ఉండాలని.. ప్రజలు ఇళ్లలోనూ మాస్కులు ధరించాలని సూచించింది.