చైనాలో వెలుగులోకి కరోనా వైరస్ నెలలు గడుస్తున్నా కూడా ఇంకా ప్రపంచ వ్యాప్తంగా కల్లోలం సృష్టిస్తూనే ఉంది. కరోనా వైరస్ రోజుకో రకంగా మారుతూ.. ప్రపంచ దేశాలను ఆందోళనకి గురి చేస్తుంది. కొన్ని దేశాల్లో కరోనా థర్డ్ వేవ్ కలకలం సృష్టిస్తుంటే, మరికొన్ని దేశాల్లో ఫోర్త్ వేవ్ కూడా మొదలుకాబోతుంది. గత వేరియెంట్స్ కంటే కరోనా వైరస్ డెల్టా వేరియంట్ అత్యంత వేగంగా వ్యాప్తిస్తూ, ప్రమాదకరంగా మారుతుంది. ఇతర కరోనా వేరియంట్లతో రోగి ముక్కులో వైరల్ లోడు కన్నా వెయ్యిరెట్లు అధికంగా డెల్టా వేరియంట్ ఉంటుందని అధ్యయనం లో తెలిసింది.
దీంతో ఇతర వేరియంట్ల కంటే ఈ డెల్టా వైరస్ అత్యంత వేగంగా వ్యాపిస్తోందని హెచ్చరికలు జారీ చేసింది. ఇంకా చెప్పాలంటే కరోనా నివారణ కోసం వ్యాక్సిన్ వేసుకున్నవారిని కూడా ఈ డెల్టా వైరస్ వదిలిపెట్టడం లేదు. దీనితో ప్రపంచ దేశాల్లో డెల్టా వైరస్ డేంజర్ బెల్స్ మ్రోగిస్తుందని ఆరోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ డెల్టా వేరియంట్ మునపటి వేరియంట్ల కంటే వేగంగా వ్యాపిస్తుంది. టీకా రెండు డోసులు తర్వాత ఇన్ ఫెక్షన్ సోకే సత్తా డెల్టాకు ఉందని అధ్యయనాల్లో తేలింది. ప్రపంచానికి అతిపెద్ద ముప్పు డెల్టా వేరియంట్ అంటూ సైంటిస్టు షారన్ పీకాక్ ఆందోళన వ్యక్తం చేశారు.
టీకాలు తీసుకున్న వ్యక్తుల్లో ఎక్కువగా సోకుతుందనడానికి ఆధారాలు ఉన్నాయని, ఈ వైరస్ సోకినవారు వారికి తెలియకుండానే వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చేయవచ్చని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఈ డెల్టా వేరియంట్‌ను ‘ఫిట్ అండ్ ఫాస్ట్’గా అభివర్ణించారు. కరోనాపై వచ్చిన టీకాల్లో అత్యంత ప్రభావవంతమైందిగా ఫైజర్ టీకాకు పేరుంది. అటువంటి ఈ ఫైజర్ టీకా కూడా డెల్టా వేరియంట్ పై 41 శాతం మాత్రమే ప్రభావం చూపుతుందని గణాంకాల్లో తేలింది. డెల్టా వేరియంట్ పై టీకాలు పెద్దగా ప్రభావం చూపడం లేదని రష్యా, అమెరికా, ఫ్రాన్స్, ఇండోనేషియా వంటి దేశాల్లో రోజు రోజుకీ పెరుగుతున్న కేసులే సాక్ష్యం అంటున్నాయి.
అంతేకాదు ఈ డెల్టా ప్రభావంతో వ్యాక్సినేషన్ వేగంగా పూర్తి చేసి ఆంక్షలు ఎత్తేసిన దేశాల్లో కూడా మళ్ళీ కఠిన ఆంక్షలు అమలు చేసే పరిస్థితులు ఏర్పడవచ్చునని నిపుణులు అంటున్నారు. బ్రిటన్ లో డెల్టా సోకినవారిలో దాదాపు 22 శాతం మంది రెండు డోసులు పూర్తి చేసుకున్నవారే ఉన్నారు. సింగపూర్, ఇజ్రాయిల్ లో కరోనా బాధితుల్లో చాలామంది వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్నవారే. ఇక అగ్రరాజ్యం అమెరికాలో కూడా కొత్త కేసుల్లో 83 శాతం డెల్టా వేరియంట్ కేసులే . ఇక యూరోపియన్ దేశాల్లో ఎక్కువగా డెల్టా వ్యాప్తి పెరిగిందని.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని లేదంటే మానవాళికి మరింత ముప్పు తప్పదని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెచ్చిరిస్తుంది. ఎప్పుడైనా డెల్టా మరింతగా వ్యాప్తి చెందే అవకాశం ఉంది.
మన దేశంలో కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ కొనసాగుతోంది. అటు కోవిడ్ సెకండ్ వేవ్ కూడా తగ్గుముఖం పట్టింది. కేసులతో పాటు మరణాలు కూడా తగ్గాయి. హమ్మయ్య.. అని అందరూ ఊపిరి పీల్చుకుంటున్న క్రమంలో.. ఎయిమ్స్ బాంబు పేల్చింది. కరోనా వ్యాక్సిన్లు వేసుకున్నా.. కరోనా సోకవచ్చని తెలిపింది. గతేడాది అక్టోబర్‌లో భారత్‌లో బయటపడ్డ డెల్టా వేరియంట్ కరోనా వేగవంతమైన వ్యాప్తికి కారణమని ఎయిమ్స్ తాజా అధ్యయనంలో వెల్లడైంది. అంతేకాదు, ప్రజలు కొవాగ్జిన్ లేదా కొవిషీల్డ్ టీకా డోసులు వేసుకున్నా సరే డెల్టా వేరియంట్ సోకే ప్రమాదం ఉందని ఎయిమ్ ఢిల్లీ, నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్సిడిసి) ప్రత్యేక అద్యయనం వెల్లడించిన సంగతి తెలిసిందే.