ఇది ఒక నరాలు తెగే ఉత్కంఠ. వచ్చే 2024 ఎన్నికలు అత్యంత కీలకంగానే కాకుండా.. ప్రతిష్టాత్మకంగా కూడా మారిపోయాయని తెలుస్తోంది. వచ్చేఎన్నికల్లో విజయం దక్కించుకుంటే.. మనకు 30 ఏళ్ల పాటు తిరుగులేదని వైసీపీ అధినేత, సీఎం జగన్ చెబుతున్న విషయం తెలిసిందే. ఇక, టీడీపీ కూడా ఇదే భావిస్తోంది. ఈసారి గెలుపు గుర్రం ఎక్కకపోతే.. కష్టమని ఇప్పటికే తీర్మానం చేసుకుంది. ఈ క్రమంలో దూకుడు పెంచింది.
యువగళం పాదయాత్ర ద్వారా..నారాలోకేష్‌ను భావి పార్టీ అధ్యక్షుడిగా తీర్చిదిద్దే ప్రయత్నం ప్రారంభిం చింది. ఇక, తనకు పథకాలే రక్షగా నిలుస్తాయని... వైసీపీ భావిస్తోంది.
ఈనేపథ్యంలో ఇరు పార్టీలు కూడా వచ్చే ఎన్నికలను ప్రాణంగా భావిస్తుంది. ఈ క్రమంలో అసలు ప్రజానాడి ఎలా ఉందనేది చూస్తే.. ఇప్పటి వరకు ఉన్న అంచనాల మేరకు.. ఫిఫ్టీ-ఫిఫ్టీగా ఉందని అంటున్నారు పరిశీలకులు.
సీఎం జగన్‌ను ఇష్టపడుతున్న వారు, అదేసమయంలో చంద్రబాబు విజన్‌కు జై కొడుతున్న వారు కూడా సమానంగానే ఉన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి మహిళలు అందరూ కూడా.. జగన్‌కు జై కొడుతున్నారు. ప్రభుత్వం ఇస్తున్న పథకాలు తీసుకుంటున్నవారు.. జగన్‌వైపు ఉన్నారనేదివాస్తవం. అయితే.. మధ్యతరగతి సహా.. పురుషుల ఓట్లు ఈ సారి టీడీపీకి అనుకూలంగా ఉన్నాయని తెలుస్తోంది.
ఇప్పటి వరకు ఏ ఎన్నిక వచ్చినా.. మహిళా ఓటు బ్యాంకు ప్రధానంగా డిసైడ్ ఫ్యాక్టర్‌గా ఉంది. దీంతో మహిళలకు సానుకూల మైన పథకాలను ప్రవేశ పెట్టి..తద్వారా.. కుటుంబాల ఓట్లను తమకు అనుకూలంగా వేయించుకునే ప్రయత్నాలు సాగాయి.
అయితే.. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది.. పురుషుల ఓట్లు ప్రధానంగా మారాయి. వైసీపీ ప్రభుత్వంలో మద్యం ధరలు పెరగడం, ఇతర పన్నుల పేరుతో బాదుడు వంటివి పురుషులపై ప్రభావం చూపిస్తున్నాయి. దీంతో వచ్చే ఎన్నికల్లో పురుష ఓట్లు డిసైడ్ ఫ్యాక్టర్ అవుతున్నాయని అంటున్నారు. దీంతో టీడీపీ ఆదిశగా అడుగులు వేయాలని నిర్ణయించినట్టు సమాచారం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.