సర్వే వేటలో...గెలుపు గుర్రాలు

Update: 2018-10-03 10:17 GMT
సర్వే...ఇప్పుడు తెలంగాణ లో  ప్రతి రాజకీయ పార్టీ - రాజకీయ నాయకుడి నోటి నుంచి వస్తున్న మాట. తెలంగాణలనో ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనుకోవాడానికి ముందే సర్వే పదం అందరీ నోట నానింది. అధికార తెలంగాణ రాష్ట్ర సమితి - మహాకూటమిలో ప‌క్షలైన కాంగ్రెస్ - తెలుగుదేశం - తెలంగాణ జన సమితి - వామపక్షాలు సర్వేల ఆధారాంగానే గెలుపు గుర్రాలను ఎంపిక చేస్తున్నాయి. ఈ సర్వే కోసం పలు సంస్థలు తమ నియోజకవర్గాలలో తమ కార్యాలయాలను ప్రారంభించాయి. అధికార తెలంగాణ రాష్ట్ర సమితి ప్రకటించిన 105 మంది అభ్యర్దులను పోలిస్ - ఇంటేలిజేంట్ విభాగాల సర్వే ఆధారంగా ఎంపిక  చేసారు. ఇక తెలుగుదేశం - కాంగ్రెస్ - తెలంగాణ జన సమితి వంటి పార్టీలు ప్రైవేటు ఏజేన్సీలకు ఈ సర్వే బాధ్యతలు అప్పగించాయి. దీంతో సర్వేలు నిర్వహించే సంస్థలకు చేతి నిండా పని దొరికింది - బూత్ స్థాయిలో సర్వేలు నిర్వహించుండడంతో గెలుపు గుర్రాల ఎంపిక సులభతరమవుతోంది. ప్రతీ నియోజకవర్గంలో దాదాపు 25 వేల మంది ఓటర్లతో మాట్లాడి అభ్యర్దుల గెలుపోటాములపై నివేదిక తయారు చేస్తున్నారు. ఇందులో వ్రుత్తుల వారిగాను - వయస్సును బట్టి - స్త్రీలు - పురుషులు - యవతి - యువకులు - విద్యార్ది - విద్యార్దులు - ప్రభుత్వ ఉద్యోగులు ఇలా వివిధ వర్గాలను సర్వే చేసి ఆ అభిప్రాయాలను ఆయా పార్టీలకు - అభ్యర్దులకు ఇస్తున్నారు.

ప్రస్తుతం మిగత పార్టీలతో పోలిస్తే తెలంగాణ రాష్ట్ర సమితి నాయకత్వమే ఎక్కువ సర్వేలను నిర్వహించిందని సమాచారం. సర్వేలా నిర్వహాణ అధికారి రామచంద్రన్ మాట్లాడుతూ "ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో పాక్షికంగానే సర్వేలను నిర్వహిస్తున్నామని - మిగతా పార్టీలు కూడా తమ అభ్యర్దులను ప్రకటించిన తర్వాత అసలు సిసలైన సర్వేలు ఉంటాయని" అన్నారు. పాక్షిక సర్వేలలో తాము 25,000 మంది ఓటర్లను మాత్రమే సర్వే చేస్తామని - పాక్షిక సర్వేల వలన పూర్తి నివేదికను ఇవ్వలేమని - అయితే పార్టీ  పరిస్థితి అంచనాకు ఈ సర్వే తోడ్పడుతుందని అన్నారు. పూర్తి స్థాయిలో సర్వేలకు పెద్ద మొత్తంలో ఖర్చు అవుతుందని - దానికి చాలా మందిని రురల్‌ కు ఏజేన్సీలకు పంపాల్సి వస్తుందని రామచంద్రన్ అన్నారు. ఇదిలా ఉండగా తెలంగాణ రాష్ట్ర సమితి మిగిలిన అభ్యర్దులను ప్రకటించిన తర్వాత మరోసారి పూర్తి స్థాయిలో సర్వేను నిర్వహించాలని అనుకుంటున్నట్లు సమాచారం. అంతే కాకుండా రాజకీయ నాయకులు సర్వేల కోసం సామాజిక మాధ్యమాలను కూడా విస్రుతంగా ఉపయోగించుకుంటున్నట్లు సమాచారం.
   

Tags:    

Similar News