అమెరికాలో రెండు పార్టీలే ఎందుకున్నాయి? అసలు కథ ఇదే!

Update: 2020-11-03 03:15 GMT
అగ్రరాజ్యం అమెరికాలో ఎన్నికలు జరిగిన ప్రతిసారి రెండు పార్టీల పేర్లే వినిపిస్తాయి. అవే డెమోక్రటిక్​ పార్టీ, రిపబ్లికన్​ పార్టీ. ప్రజలకు వేరే ఆప్షన్​ లేదు. ఈ రెండు పార్టీలకు చెందిన అభ్యర్థులనే ఎన్నుకోవాలి. మనదేశంలో కొన్ని వందల రాజకీయపార్టీలు ఉంటాయి. రాష్ట్రానికో జెండా.. అజెండా ఉంటాయి. ప్రజలు తమకు ఇష్టమైన అభ్యర్థులను ఎన్నకోవచ్చు. కానీ అగ్రరాజ్యం అమెరికాలో ఎందుకని రెండు పార్టీలే ఉంటాయి. దీని వెనక ఉన్న అసలు కథ ఏమిటో తెలుసుకుందాం.. ప్రజాస్వామ్య దేశంగా చెప్పుకొనే అమెరికాను శతాబ్దాలుగా రెండు పార్టీలే శాసిస్తున్నాయి. ఈ ఏడాది జరగనున్న 58వ అధ్యక్ష ఎన్నికల్లోనూ ఈ రెండు పార్టీలే తలపడుతున్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికలు నాలుగేళ్లకు ఒకసారి జరుగుతాయి. ప్రతీ ఏడాది నవంబరులో తొలి సోమవారం తర్వాత వచ్చే మంగళవారం(నవంబరు 8) ఎన్నికలు నిర్వహిస్తారు. 1845 నుంచీ ఇదే జరుగుతోంది.

ఇదే సమయంలో సమాఖ్య(కేంద్ర), రాష్ట్ర, స్థానిక ఎన్నికలు కూడా జరగుతాయి. సాధారణ ఎన్నికలుగా పరిగణించే ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు 35 ఏళ్లు నిండిన దేశ పౌరులను అర్హులుగా పరిగణిస్తారు. లేదంటే కనీసం 14 ఏళ్లపాటు అమెరికాలో నివసిస్తున్నవారు అయి ఉండాలి. రెండుసార్లు అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తి మూడోసారి పోటీకి అనర్హుడు. డెమొక్రటిక్, రిపబ్లికన్ పార్టీలే అమెరికాను పాలిస్తున్నాయి. ఇవి రెండు కాక అమెరికాలో రాజకీయ పార్టీలు ఉండవా అంటే.. ఉంటాయి. అమెరికాలో మొత్తం 30 వరకు చిన్న చితకా పార్టీలు ఉన్నాయి. వాటిలో లిబర్టేరియన్, కాన్‌‌స్టిట్యూషన్ పార్టీ, గ్రీన్ పార్టీ, 1869లో పురుడు పోసుకున్న ప్రొహిబిషన్, 1919లో స్థాపించిన కమ్యూనిస్టు పార్టీ, 2011లో తెరపైకి వచ్చిన జస్టిస్ పార్టీ, 2014లో స్థాపించిన ట్రాన్స్ హ్యూమన్ పార్టీ.. ఇలా 30కి పైగా పార్టీలు గుర్తింపు పొందాయి.

ఎన్ని పార్టీలు పుట్టుకొచ్చినా 1854లో స్థాపించిన రిపబ్లికన్ పార్టీ, 1868లో వచ్చిన డెమోక్రటిక్ పార్టీలు మాత్రం బరిలో దిగుతాయి. ఇందుకు కారణం అమెరికా ఎన్నికల సందర్భంగా అయ్యే వ్యయమే. వందల కోట్ల డాలర్లు ఖర్చు పెట్టగలిగే పార్టీలు మాత్రమే అక్కడ బరిలో నిలుస్తాయి. అమెరికాలో ఎన్నికల్లో పోటీపడం చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ కోసం ఓసారి, అది సాధించాక మరోసారి దేశం మొత్తం పర్యటించాల్సి ఉంటుంది. ఇందుకు వందల కోట్ల డాలర్లు ఖర్చుఅవుతుంది. చిన్నచితకా పార్టీలకు ఇది పెనుభారం. 2012 ఎన్నికల్లో ఒబామా ఒక్కరే వంద కోట్ల డాలర్లు ఖర్చు చేశారని అక్కడి విశ్లేషకులు చెబుతుంటారు. అయితే రాజకీయ పార్టీలు డబ్బులను ఖర్చు చేసేందుకు పారిశ్రామిక వేత్తల నుంచి విరాళాలు సేకరించాల్సి ఉంటుంది. గెలిచే సత్తా ఉన్న పార్టీలకే వాళ్లు విరాళాలు ఇస్తారు. అందువల్ల చిన్నపార్టీలు అక్కడ ఉనికి కోల్పోతూ ఉంటాయి. 1992, 1996లో రాస్ పెరోట్ సారథ్యంలోని రిఫార్మ్ పార్టీ సాహసం చేసి బరిలో నిలిచింది. కానీ ఒక్క ఎలక్ట్రోరల్ ఓటు కూడా దక్కకపోవడంతో వెనక్కి తగ్గింది. అమెరికా ఎన్నికలు ఖర్చుతో కూడుకున్నవి కావడంతో అక్కడి రాజకీయపార్టీలు పోటీకి వెనకాడతాయి.
Tags:    

Similar News