పెద్ద‌నోట్ల ర‌ద్దు ఎంత త‌ప్పో చెప్పిన తాజా పుస్త‌కం!

Update: 2019-03-20 05:36 GMT
కీల‌క‌మైన ఎన్నిక‌ల వేళ‌.. మోడీ ప‌రివారం మొత్తం ఆయ‌న్ను ఆకాశానికి ఎత్తేస్తూ.. అలాంటి నేత మ‌రోసారి ప్ర‌ధాని కావాల్సిందేనంటూ ఇంటా బయ‌టా భారీగా ప్ర‌చారంచేస్తున్న సంగ‌తి తెలిసిందే. రాజ‌కీయ పార్టీల‌కు.. అగ్ర నేత‌ల‌కు ఫ్యాన్ పాలోయింగ్ మామూలే. కానీ.. మోడీ మాష్టారికి ఉండే ఫ్యాన్స్ మామూలు కాదు. అర‌వీర భ‌యంక‌రులే కాదు.. త‌మ మాట‌ల‌తో సామాన్యుల్ని విప‌రీతంగా ప్ర‌భావితం చేసే వారిగా చెప్పాలి.

ఇప్ప‌టివ‌ర‌కూ దేశ రాజ‌కీయాల్లో చుట్టూ ఉన్న వారిని తీవ్రంగా ప్ర‌భావితం చేసే వారిలో క‌మ్యునిస్టుల‌ను ప్ర‌స్తావిస్తారు. వారి మ‌ధ్య ఉండే బంధం.. త‌ప్పులు చేసినా వాటిని క‌వ‌ర్ చేయ‌టం.. వారిని నెత్తిన పెట్టుకోవ‌టం.. త‌మ వారి కోసం ఎలాంటి లాభాపేక్ష ఆశించ‌కుండా.. ప్ర‌తిఫ‌లం కోర‌కుండా ప‌ని చేయ‌టం క‌మ్యునిస్టుల‌లో క‌నిపిస్తుంది.

అలాంటి తీరు మోడీని అభిమానించే వారిలో మ‌రింత ఎక్కువ‌గా క‌నిపిస్తూ ఉంటుంది. ఎన్నిక‌ల‌కు రెండు.. మూడు నెల‌ల ముందు నుంచే మోడీని అభిమానించే బ్యాచ్ మొత్తం ఆయ‌న్ను మ‌రోసారి ప్ర‌ధాని చేసేందుకు త‌మ ప‌నులు మానుకొని మ‌రీ ప్ర‌చారం చేయ‌టం షురూ చేశారు. మోడీ బ్యాచ్ లో క‌నిపించే గొప్ప‌త‌నం ఏమంటే.. వారు ఎప్పుడూ మోడీ పాజిటివ్స్ మాత్ర‌మే చెబుతారు కానీ నెగిటివ్స్ చెప్ప‌టం క‌నిపించ‌దు. మోడీ పాల‌న‌ను మెరుపుల్ని చెబుతారే కానీ.. మ‌ర‌క‌ల్ని అస్స‌లు ప్ర‌స్తావించారు.

ఇలాంటి స‌మ‌యంలో విడుద‌లైన ఒక పుస్త‌కం మోడీ హ‌యాంలో జ‌రిగిన త‌ప్పుల్ని ఎత్తి చూపించారు. ప్ర‌ముఖ ఆర్థిక‌వేత్త‌.. రాజ‌కీయ విశ్లేష‌కుడు స‌ల్మాన్ అనీజ్ సోజ్ అనే పెద్ద మ‌నిషి తాజాగా ‘ది గ్రేట్‌ డిసప్పాయంట్‌మెంట్‌: హౌ నరేంద్ర మోదీ స్వాండర్డ్‌ ఏ యూనిక్‌ ఆపర్చూనిటీ టూ ట్రాన్స్‌ఫార్మ్‌ ది ఇండియన్‌ ఎకానమీ’ పేరుతో ఒక‌పుస్త‌కాన్ని రాశారు. ఇందులో పెద్ద‌నోట్ల ర‌ద్దు విష‌యాన్ని ప్ర‌స్తావించ‌ట‌మే కాదు.. అదో భ‌యంక‌ర‌మైన ఆలోచ‌న‌గా పేర్కొన్నారు. అంతేకాదు.. మోడీ హ‌యాంలో ఆయ‌న అమ‌లు చేసిన ఆర్థిక విధానాల్ని మోడీనామిక్స్ గా పేర్కొంటూ చేసిన విశ్లేష‌ణ ఇప్పుడు ప‌లువురి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. మ‌రి.. దీని మీద మోడీ అభిమాన సంఘాలు ఎలా రియాక్ట్ అవుతాయో చూడాలి.

Tags:    

Similar News