ఒవైసీకి మద్దతుగా రాజస్థాన్ లో ప్రదర్శనలు

Update: 2016-07-18 11:33 GMT
హైదరాబాద్ బేస్డ్ పార్టీ ఎంఐఎం పాపులారిటీ - ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ పాపులారిటీ దేశవ్యాప్తమవుతోంది. ఇప్పటికే మహారాష్ట్రలో ఎమ్మెల్యేలను గెలిపించుకున్న ఎంఐఎం బీహార్ ఎన్నికల్లోనూ పోటీ చేసింది. బెంగాల్ లోనూ విస్తరించేందుకు ప్రణాళికలు వేస్తోంది. ఇక తాజాగా అసదుద్దీన్ కు రాజస్థాన్ లోనూ మద్దతు దొరుకుతోంది. అసద్ పై దేశద్రోహం కేసు పెట్టడం కరెట్టు కాదంటూ.. ఆయనకు మద్దతుగా రాజస్థాన్ లోని జైపూర్ లో భారీ ప్రదర్శన జరిపారు. అసద్ ఒక్కడి కోసమే కాకుండా ఇస్లామిక్ మతబోధకుడు జకీర్ నాయిక్ కు కూడా మద్దతుగా ఈ ర్యాలీ తీశారు.

పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అనే ముస్లిం సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రదర్శనలో అసదుద్దీన్ - జకీర్ లకు మద్దతుగా నినాదాలు చేశారు. ఆ సంస్థ అధ్యక్షుడు అనీష్ అన్సారీ మాట్లాడుతూ…ప్రభుత్వం - ఒక వర్గం వారు వారిరువురినీ అప్రదిష్ట పాలు చేయాలని ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. జకీర్ నాయిక్ - అసదుద్దీన్ ఒవైసీ  ఇద్దరూ  ప్రజలలో గుర్తింపు ఉన్న నాయకులని పేర్కొన్నారు. ఇస్లామిక్ బోధకుడైన జకీర్ నాయిక్ పలు సందర్భాలలో ఉగ్రవాదాన్ని ఖండించారనీ, ఆయనపై ఏ చర్య తీసుకున్నా అది మైనారిటీల ప్రయోజనాల పరిరక్షణకు రాజ్యాంగంలో ఉన్న హామీని ఉల్లంఘించడమే అవుతుందన్నారు. అలాగే ఇటీవల హైదరాబాద్ లో అరెస్టయిన ఎన్ ఐఏ అనుమానితులకు న్యాయ సహాయం అందిస్తానన్న ఒవైసీపై దేశద్రోహం కేసు నమోదు చేయడం సరికాదని పేర్కొన్నారు.

కాగా అసదుద్దీన్ ముస్లిం వర్గానికి బలమైన నేతగా మారుతున్నారనడడానికి ఇది సంకేతమని విశ్లేషకులు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ముస్లింలను ప్రభావితం చేసే స్థాయిలో అసదుద్దీన్ ఉన్నారని.. వివిధ రాష్ట్రాల్లో ఆయనకు మద్దతుగా ఆ వర్గం ప్రజలు రావడానికి కారణం ఇదేనని చెబుతున్నారు.
Tags:    

Similar News