అవకాశాల స్వర్గదామంగా పేరొందినప్పటికీ - గత కొద్దికాలంగా ఆంక్షల పరంపరకు సుపరిచిత చిరునామాగా మారిన అమెరికాలో ఆసక్తికర కేసు తెర మీదకు వచ్చింది. తమ నిర్ణయాలు మరోమాట లేకుండా అమలు చేయాలనే అమెరికా దోరణికి షాకిచ్చేలా హెచ్1బీ వీసా నిరాకరించినందుకు అమెరికా ప్రభుత్వంపై సదరు అర్హుడైన తెలుగోడి తరఫున ఐటీ కంపెనీ కోర్టులో కేసు వేసింది. సంస్థ ఏకపక్ష నిర్ణయాన్ని సమీక్షించాలని కోరింది.
28 సంవత్సరాల ప్రహర్ష చంద్ర సాయి వెంకట అనిశెట్టి అనే వ్యక్తిని బిజినెస్ సిస్టమ్ అనలిస్ట్ గా అమెరికాలోని ఎక్స్ టెర్రా సొల్యూషన్స్ సంస్థ నియమించుకుంది. తన భార్య ఉద్యోగి కావడంతో హెచ్4 వీసా కలిగి ఉన్న ప్రహర్ష ఉద్యోగంలో చేరిన అనంతరం హెచ్1బీ వీసాకు దరఖాస్తు చేసుకున్నాడు. అయితే ఆయనకు యూఎస్ సిటిజన్ షిప్ ఆండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్ సీఐఎస్) వీసా నిరాకరించింది. ఆయనకు హెచ్1బీ వీసా నిరాకరిస్తూ - ప్రత్యేక నైపుణ్యాలకు ఆయన అర్హుడు కాదని పేర్కొంది.
అయితే, దీనిపై ప్రహర్షకు ఉద్యోగం కల్పించిన ఎక్స్‌టెర్రా సొల్యూషన్స్ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. అమెరికాలో టెక్సాస్ యూనివర్సిటీలో ఉన్నత విద్యాభ్యాసం చేయడంతో పాటుగా - అనంతరం సంబంధించిన వృత్తి శిక్షణను సైతం పూర్తి చేసుకొని తదుపరి ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నారని సంస్థ పేర్కొంది. బిజినెస్ అనలిస్ట్ గా అన్ని అర్హతలు పరిగణనలోకి తీసుకొని కేటాయించినప్పటికీ - ఏకపక్షంగా వీసా నిరాకరించారని తన వాదనల్లో సంస్థ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. నిర్దేశిత అర్హత కాకుండా ఉన్నత విద్యాభ్యాసం కలిగి ఉన్నారని వీసా కేటాయించకపోవడం సరికాదని వాదించారు