ఎక్స్ లేటర్ టచ్ చేయగానే.. రయ్ రయ్ మంటూ కిలోమీటర్ల కొద్దీ దూసుకెళ్తాయి.. లగ్జరీ సీట్లతో ఆకట్టుకుంటాయి.. కోట్ల రూపాయల్లో ధరలు పలుకుతాయి.. చూడగానే డ్రైవ్ చేయాలనిపించే కొన్ని ఖరీదైన కార్లు కొందరికి మాత్రమే సొంతం అవుతాయి. సాధారణ వ్యక్తులు వీటిని కొనుగోలు చేయలేరు. బడా బాబులకు మాత్రమే వీటిని దక్కించుకునేందుకు సాధ్యమవుతుంది. అయితే ఇన్ని కోట్లు పెట్టి.. ఇంత లగ్జరీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్న ఈ కార్ల యజమానులు కొన్ని కక్కుర్తి పనులు చేస్తున్నారు. లక్ష రూపాయల కారైన.. కోటి రూపాయల కారైనా నడిచేది రోడ్డుపైనే.. కానీ లక్షరూపాయల కారు నడిపే యజమానికున్న విలువ.. కోట్ల రూపాయల కారుల్లో తిరిగే వారికి లేకపోవడం ఆశ్చర్యకరం. మరి వీరి విలువ ఎందుకు దిగజారింది..?
హైదరాబాద్ రోడ్లపై ఇటీవల అత్యంత ఖరీదైన కార్లు వెళ్తుండడాన్ని చూస్తూన్నాం. ఇలాంటి కార్లను చూసి అందులో ఒక్కసారైనా వెళ్లాలని అనుకుంటాం. కానీ ఆ ఛాన్స్ కొందరికే ఉంటుందని ఊరుకుంటాం. ఇంతటి అరుదైన ఛాన్స్ కొట్టేసిన వారిపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. దాదాపు కోటికిపై గా విలువ చేసే కొందరు కార్ల యజమానులు ఆ కార్లకు టాక్సులు కట్టడం లేదట. లగ్జరీ కార్లలో స్వేచ్ఛగా తిరుగుతున్న వీరు ప్రభుత్వానికి పన్నులు చెల్లించమంటే మాత్రం వెనుకాడుతున్నారట. ఈ వ్యవహారాన్ని పసిగట్టిన హైదరాబాద్ రవాణాశాఖ కమిషనర్ ఏక కాలంలో దాడులు నిర్వహించింది.
పలు ప్రాంతాల్లో ఒకేసారి లగ్జరీ కార్లను తనిఖీలు చేసింది. రవాణా శాఖ ఉప కమిషనర్ డాక్టర్ పాపారావు ఆధ్వర్యంలో 40 మంది మోటార్ వెహికిల్ అధికారులు దాడులు చేసి 11 లగ్జరీ కార్లను సీజ్ చేశారు. ప్రభుత్వానికి పన్ను కట్టని వారి నుంచి వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఇలా సీజ్ చేసిన వాహనాల నుంచి రూ. 5 నుంచి 8 కోట్లు వసూలవడం చూసి షాక్ తిన్నారు. పరోక్షంగా రూ. 100 కోట్ల వరకు పన్నులు వసూలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
రవాణాశాఖ అధికారులు సీజ్ చేసిన కార్లలో మెర్సిడెజ్ బెంజ్, బీఎం డబ్ల్యూ, ఫెరారి, మాసరట్టి, లాంబోర్గిని వంటివి ఉండడం విశేషం. ఇవన్నీ కోటి రూపాయలకు పైగానే రేటు పలుకుతాయి. ఇన్ని కోట్లు పెట్టిన కొన్న వారు ప్రభుత్వానికి మాత్రం టాక్స్ కట్టకుండా తప్పించుకు తిరుగుతున్నారు. ఇక పట్టుపడిన కార్ల యజమానుల నుంచి అప్పటికప్పుడు పన్ను వసూలు చేశారు. కొందరు తరువాత చెల్లించారు మొత్తంగా వీరి వద్ద నుంచి రవాణా శాఖ వారు టాక్స్ వసూలు చేశారు.
స్వదేశంలో కొన్న వారి నుంచి పన్నులు వసూలయ్యాయి. ఇక విదేశంలో కొన్న వారి నుంచి పన్నులు రావాల్సి ఉంది. అయితే కొందరు ఇంపోర్ట్ టాక్స్, ఎంట్రీ టాక్స్ ఎగ్గొట్టడానికి అనేక రకాలుగా యత్నిస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతులు చేసుకుంటూ పన్నులు ఎగ్గొడుతున్నారు. కానీ రవాణా శాఖ అధికారులు మాత్రం వీరి భరతం పడుతున్నారు. ఏక కాలంలో భరతం పట్టి వారి వద్ద నుంచి టాక్స్ వసూలు చేస్తున్నారు. ఇలా ప్రతీ సారి ఆకస్మిక దాడులు చేస్తే టాక్స్ కట్టడానికి ముందుకు వస్తారని కొందరు అంటున్నారు.
కాగా లగ్జరీ కార్లపై ఇలా ఒకేసారి దాడులు చేయడం ఇదే తొలిసారి. ధనవంతులు అని చూడకుండా రవాణా శాఖ దాడులు చేయడం ఆసక్తిగా మారింది. పన్నులు కట్టకుండా ఎగ్గొట్టే వారిపై తగిన చర్యలు తీసుకుంటామని రవాణా శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. అయితే ప్రతీ సారి ఇలాంటి దాడులు కొనసాగించాలని పలువురు పేర్కొంటున్నారు.