తెలంగాణ హోంమంత్రికి కేసీఆర్ నో ఎంట్రీ.. ఇందుకేనా?

Update: 2020-04-02 17:30 GMT
తెలంగాణ డిప్యూటీ సీఎం, హోంమంత్రి అయిన మహమూద్ అలీకి సీఎం కేసీఆర్ ఇంట్లోకి రావడానికి అనుమతి దక్కలేదు. నిన్న కేసీఆర్ నిర్వహించిన సమావేశానికి వచ్చిన మహమూద్ అలీని ప్రగతి భవన్ అధికారులు ఇంట్లోకి రానీయలేదు. అనుమతి లేదు అనడంతో ఆయన తిరిగి ఇంటికెళ్లిపోయారు. ఈ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. డీజీపీ లోపలే ఉండడం.. ఆ శాఖ చూసే హోంమంత్రిని రానీయక పోవడం దుమారం రేపింది.

అయితే ఢిల్లీ మర్కాజ్ యాత్రికులను హోంమంత్రి మహమూద్ అలీ కలిసి ఉంటారని.. పాతబస్తీలో చాలా మందితో సన్నిహితంగా ఉండే మహమూద్ అలీ వల్ల కరోనా వైరస్ విస్తరిస్తుందనే కారణంతో కేసీఆర్ ఇంట్లోకి రానీయలేదని తెలుస్తోంది.  మహమూద్ అలీది పాతబస్తీయే. అక్కడి నుంచే ఢిల్లీలోని మార్కాజ్ కు చాలా మంది వెళ్లారు. వారితో మహమూద్ అలీ సన్నిహితంగా ఉండి ఉంటారని అందుకే రానీయలేదన్నది టాక్.

మహమూద్ అలీ శాఖ చూసే పోలీసులే ఆయన్ను కేసీఆర్ ఇంట్లోకి రానీయక పోవడం దుమారం రేపింది. మహమూద్ అలీకి ముందే సమాచారం ఇచ్చి ఉంటే ఆయన రాకపోయి ఉండేవారిని.. ఇప్పుడు వచ్చి మరలిపోవడం వివాదాస్పద మవుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి..కానీ ఢిల్లీ మర్కజ్ ఉదంతం నేపథ్యంలోనే అదే ప్రాంతంలో ఉండే మహమూద్ అలీని దూరం పెట్టినట్టు తెలుస్తోంది.
Tags:    

Similar News