ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి నోరుజారారు. టంగ్ స్లిప్ అయ్యి సొంత పార్టీ అధినేత జగన్ పైనే హాట్ కామెంట్ చేశారు. పవన్ కళ్యాణ్ ను అనబోయి జగన్ ను ఉద్దేశించిన ఆయన చేసిన కామెంట్స్ వీడియో వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది. తెలుగు తమ్ముళ్లు డిప్యూటీ సీఎం నారాయణ స్వామిపై సెటైర్ల వర్షం కురిపిస్తున్నారు. ట్రోల్స్ చేస్తున్నారు.
ఈ ఉదయం ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. ఆలయం వద్ద ఆయనకు అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల ఆశీర్వచనం పలుకగా.. అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. సత్కరించారు.
దర్శనం అనంతరం డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మాట్లాడుతూ నోరుజారారు. ‘జగన్ దాడి చేసేది ఏంటి? ప్రజలే జగన్ పై దాడి చేసే రోజులు రాబోతున్నాయన్నారు. జగన్ ప్రజలపై దాడి చేయడం కాదు.. ప్రజలు తిరుగుబాటు చేసే రోజులు త్వరలో ఉన్నాయి’ అని నారాయణ స్వామి నోరుజారారు. పవన్ పై అనబోయి జగన్ పై అంటూ టంగ్ స్లిప్ అయ్యారు. ఆ తర్వాత పక్కనున్న వారు అలెర్ట్ చేయడంతో పవన్ పై విరుచుకుపడ్డారు.
క్యారెక్టర్ లేని పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడటం నా వ్యక్తిత్వానికే లోటు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహిళలపై అన్యాయాల గురించి ప్రశ్నిస్తున్న జనసేన అధినేత పవన్ తన ద్వారా నష్టపోయిన మహిళల గురించి ముందు మాట్లాడాలన్నారు. పవన్ కళ్యాణ్ కు మనసనేదే లేదని.. ఆయన మహిళలను ఏ విధంగా హింసించారో ప్రజలే చూస్తున్నారని తెలిపారు. కులాల గురించి మాట్లాడే పవన్ లాంటి వాడు ప్రజా నాయకుడు కాకూడదని.. అందుకే ప్రజలు రెండు చోట్ల తిరస్కరించారు అని నారాయణ స్వామి తిరుపతిలో తీవ్ర విమర్శలు గుప్పించారు.
పవన్ ను చూసి యువకులు రెచ్చిపోతున్నారు. అసలు ఆయన ఎప్పుడు బీజేపీలో ఉంటాడో.. టీడీపీలో ఉంటాడో తెలియదు.. పవన్ పై ప్రజలే తిరుగుబాటు చేసే రోజులు వస్తాయని నారాయణ స్వామి విరుచుకుపడ్డారు.
Full View
Full View Full View Full View Full View