తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వేడుకగా సాగుతున్నాయి. అన్ని జిల్లాల్లోనూ ప్రత్యేక కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నారు. ఇదే రీతిలో వరంగల్ జిల్లాలోనూ వేడుకల్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర డిఫ్యూటీ సీఎం కడియం శ్రీహరి హాజరయ్యారు.
వరంగల్ పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన ఆవిర్భావ వేడుకల్లో భాగంగా జెండా ఆవిష్కరించిన కడియం.. తన ప్రసంగాన్ని మొదలు పెట్టారు. ఏమైందో ఏమో కానీ అస్వస్థతకుగురైన కడియం.. ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోవటంతో కలకలం రేగింది. వెంటనే అక్కడున్న వైద్యులు ప్రధమ చికిత్స నిర్వహించటంతో ఆయన కోలుకున్నారు.
కాసేపటికే తిరిగి తన ప్రసంగాన్ని కడియం కొనసాగించారు. ఎండ తీవ్రత కారణంగానే కడియం అస్వస్థతకు గురై ఉంటారని భావిస్తున్నారు.
అస్వస్థతకు గురైన కడియంను ఆసుపత్రికి తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆయన్ను కారులో కూర్చోబెట్టారు. వెంటనే ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేయగా.. వారించారు కడియం. కార్యక్రమం పూర్తి అయ్యే వరకూ తాను అక్కడే ఉంటానన్న విషయాన్ని అధికారులకు స్పష్టం చేసిన ఆయన.. కారులో నుంచే వేడుకలను చూస్తుండిపోవటం విశేషం.
ఎండలు మండుతున్న వేళ.. బిజీబిజీ షెడ్యూల్ లో ఉన్న నేతలు అస్వస్థతకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/