బాబును కలిసిన వైకాపా ఎమ్మెల్యే..టీడీపీలోకి!

Update: 2019-03-15 11:33 GMT
చిత్తూరు జిల్లాకు చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే దేశాయి తిప్పారెడ్డి తెలుగుదేశం పార్టీలోకి చేరనున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఆయన చంద్రబాబును కలిశారు. ఇక ఆయన తెలుగుదేశం పార్టీలోకి చేరడం లాంఛనమే అని తెలుస్తోంది.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున తిప్పారెడ్డికి టికెట్ లభించే అవకాశాలు లేకుండా పోయాయి. ఇప్పటికే ఆ మేరకు స్పష్టత వచ్చిందట. మదనపల్లె నుంచి గత ఎన్నికల్లో నెగ్గిన తిప్పారెడ్డి - మరోసారి అక్కడ నుంచినే పోటీ చేయాలని అనుకుంటున్నారట. అయితే… వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆయనకు టికెట్ ను నిరాకరిస్తున్నట్టుగా తెలుస్తోంది.

చిత్తూరు జిల్లాలో సిట్టింగుల విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మార్పులకు తావిస్తోంది. పూతలపట్టు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ను కూడా మార్చనున్నారని ప్రచారం జరుగుతూ ఉంది. తిప్పారెడ్డి కి కూడా టికెట్ కేటాయించడం కష్టంగానే మారిందట.

ఇలాంటి నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాబితా వెలువడకుండానే.. తిప్పారెడ్డికి అందుకు సంబంధించి క్లారిటీ వచ్చిందట. ఈ నేపథ్యంలో ఈయన తన దారి తను చూసుకొంటున్నట్టుగా ఉన్నాడు. రేపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాబితా విడుదల అయ్యే అవకాశాలున్నాయి. వివేకానందరెడ్డి హత్య నేపథ్యంలో.. ఆ పార్టీ పరిణామాలపై ప్రతిష్టంభన నెలకొంది.
Tags:    

Similar News