తెలంగాణ లో కరోనా రోజురోజుకి మరింతగా విస్తరిస్తుంది. దీనితో రాష్ట్రంలో హాట్ స్పాట్ ప్రాంతాల్లో లక్షలాది మంది ప్రజలు గృహనిర్బంధంలో ఉండిపోయారు. వారిని ప్రభుత్వం పూర్తిగా హోం క్వారంటైన్ కు పరిమితం చేసింది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వం 130 హాట్ స్పాట్లను ప్రకటించింది. శుక్రవారం ఆయా ప్రాంతాల్లో నిర్ణీత ప్రదేశం మేరకు పూర్తిగా మూసేసారు. ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి, ఎవరు ఇంట్లో నుండి బయటికి రాకుండా చూస్తున్నారు.
అక్కడున్న ప్రజలకు అవసరమైన పాలు, కూరగాయలు, ఇతర నిత్యావసరాలను కూడా ప్రభుత్వ యంత్రాంగమే అందిస్తుంది. హాట్ స్పాట్ ప్రాంతాల్లో కొన్నిచోట్ల డ్రోన్లను వినియోగిస్తూ పోలీసులు పహారా కాస్తున్నారు. వైద్య బృందాలు ఇళ్లకు వెళ్లి జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలున్న వారిని గుర్తించి ఆస్పత్రులకు తరలిస్తున్నాయి. తెలంగాణాలో హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్, గద్వాల, కరీంనగర్, నిర్మల్, వరంగల్ అర్బన్ జిల్లాల్లో అత్యధికంగా కేసులు నమోదయ్యాయి. విదేశాల నుంచి వచ్చిన వ్యక్తుల ద్వారా, అలాగే ఢిల్లీ మర్కజ్‌కు వెళ్లొచ్చిన వారు, వారి కుటుంబీకుల ద్వారా అత్యధిక కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం హాట్ స్పాట్ ప్రాంతాలని గుర్తించి , అక్కడ పటిష్టమైన భద్రతని ఏర్పాటు చేస్తుంది. రాష్ట్రంలో 130 హాట్‌స్పాట్లను గుర్తించినట్లు తెలుస్తుంది.
హాట్ స్పాట్ ప్రాంతాల్లో మొత్తం 2.88 లక్షల ఇళ్లను గుర్తించారు. ఒక్కో ఇంట్లో సరాసరి ఐదుగురు సభ్యులుంటారని అంచనా వేశారు. ఆ ప్రకారం 14.40 లక్షల మంది అష్టదిగ్బంధంలో ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో 3,116 వైద్య బృందాలు ఇంటింటి సర్వే చేస్తున్నాయి. 130 హాట్ స్పాట్ లలో ఉండే లక్షలాది మంది ప్రజలు నిర్ణీత తేదీ నుంచి 14 రోజులపాటు హోం క్వారంటైన్ లోనే ఉండాలి. కేసుల తీవ్రతను బట్టి జిల్లా అధికారులు హాట్ స్పాట్ లను మ్యాపింగ్ చేశారు. దాని పరిధిని కిలోమీటర్ నుంచి మూడు కిలోమీటర్ల వరకు నిర్ధారించారు. పీహెచ్ సీ వైద్యులు ప్రతిరోజూ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఒక్కో హాట్ స్పాట్ ఏరియాలో తమకు కేటాయించిన ఇళ్లకు వెళ్లి పరీక్షలు నిర్వహిస్తారు. అక్కడి ప్రజల్లో ఎవరికైనా అనుమానిత లక్షణాలుంటే వారిని గుర్తించి అవసరాన్ని బట్టి ఆస్పత్రులకు పంపిస్తారు. అలాగే ఆ ప్రాంతాలలోని ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో అధికారులను సంప్రదించడానికి టోల్ ఫ్రీ నంబర్ ఇచ్చారు.