ట్రంప్ చ‌ట్టం...అమ‌లుకు ముందే న‌ర‌కం

Update: 2018-01-19 23:30 GMT
అధికారం చేప‌ట్టింది మొద‌లు అమెరికా అంటేనే వ‌ల‌సదారులు భ‌య‌ప‌డేలా చేస్తున్న ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణ‌యం తాలుకూ విప‌రిణామాలు ద‌డ పుట్టిస్తున్నాయి. బాల్యంలో తల్లిదండ్రుల వెంట వచ్చిన కాందిశీకుల (డ్రీమర్స్)ను వెనక్కి పంపాలన్నఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం తీసుకున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఇది అమ‌ల్లోకి రాక‌ముందే..ఆ దేశంలోని వ‌ల‌స‌ వారిపై ఉక్కుపాదం మోపుతున్నారు. అలా క్షోభ ప‌డుతున్న 39 జార్జి గార్సియా ఉదంతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

మిచిగాన్‌ రాష్ట్రంలోని డెట్రాయిట్‌ లో జార్జ్ త‌న భార్య పిల్ల‌ల‌తో ఆనందంగా గ‌డిపేవాడు. అయితే ట్రంప్ నిబంధ‌న కార‌ణంగా ఆయన్ను దేశం వ‌దిలివెళ్లాల‌ని అధికారులు ఆదేశించారు. త‌న భార్య అమెరిక‌న్ అని పేర్కొంటూ ఏళ్లుగా ఇక్క‌డే ప‌న్నులు క‌డుతున్నాన‌ని..అమెరికా నిబంధ‌న‌ల ప్ర‌కారం న‌డుచుకుంటున్నాన‌ని ఆయ‌న వివ‌రించారు. అయితే అధికారులు విన‌లేదు. ఆఖ‌రికి డాకా చ‌ట్టం అమ‌ల్లోకి వ‌చ్చేవ‌ర‌కైనా...స‌మ‌యం ఇవ్వాల‌ని కోరిన‌ప్ప‌టికీ వినిపించుకోలేదు. దీంతో మెక్సికోకు వెళ్లేందుకు జార్జీ సిద్ధ‌మ‌య్యారు. అయితే ఎయిర్‌ పోర్ట్ లో జార్జీ వెళ్ల‌లేక‌..ఉండ‌లేక స‌త‌మ‌త‌మ‌వుతుంటే..ఆయ‌న భార్య‌ - పిల్ల‌లు క‌న్నీటి ప‌ర్యంత‌మ‌య్యారు. అయిన‌ప్ప‌టికీ..అధికారులు ఆయ‌న్ను విమానం ఎక్కించుకుంటూ వెళ్లిపోయారు. జార్జీ మెక్సికోకు జ‌న‌వ‌రి 15న ప‌య‌న‌మ‌యిన‌ది వ‌ల‌స‌వాదుల హ‌క్కుల కోసం పోరాడిన మార్టిన్ లూథ‌ర్‌ కింగ్ జ‌యంతి కావ‌డం గ‌మ‌నార్హం.

కాగా, మ‌రోవైపు ట్రంప్‌ నిర్ణయం క్రూరమైందని - ఇది స్వయంగా ఓటమిని అంగీకరించడమే అవుతుందని తాజా మాజీ అధ్య‌క్షుడు బ‌రాక్‌ ఒబామా  గ‌తంలోనే స్పందించారు. సుమారు 8 లక్షల మంది డ్రీమర్స్‌ (డిఫర్డ్‌ యాక్షన్‌ ఫర్‌ చైల్డ్‌హుడ్‌ అరైవల్స్‌- డీఏసీఏ) వర్క్‌ పర్మిట్లను అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ రద్దు చేయడాన్ని క్రూరమైన నిర్ణయమని విమర్శించారు. డ్రీమర్స్‌ ఆశలు గల్లంతు చేస్తూ ఫైలుపై ట్రంప్‌ సంతకం చేసిన రోజే ట్రంప్‌ చర్యను ఒబామా తప్పుపట్టారు. వలసదారుల వల్ల అమెరికాకు పొంచి ఉన్న ప్రమాదమే మీలేదని, వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరంలేదని తన ఫేస్‌ బుక్‌ ఖాతాలో ప‌ద‌వికి ఒబామా పేర్కొన్నారు. పేరెంట్స్‌ అమెరికాకు రావడమే డ్రీమర్స్‌ చేసిన తప్పిదం కాదని.. దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే యువతపై ఆంక్షలు విధించడం మంచిది కాదని ఆయన హితవు పలికారు.
Tags:    

Similar News